రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు నిలిపివేత...ఆస్ట్రేలియా రిఫైనర్ వివా ఎనర్జీ సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2022-03-08T17:59:22+05:30 IST

ఆస్ట్రేలియన్ రిఫైనర్లు రష్యా దేశం నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలును నిలిపివేశారు....

రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు నిలిపివేత...ఆస్ట్రేలియా రిఫైనర్ వివా ఎనర్జీ సంచలన నిర్ణయం

మెల్‌బోర్న్:  ఆస్ట్రేలియన్ రిఫైనర్లు రష్యా దేశం నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలును నిలిపివేశారు. ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యా దేశంతో వాణిజ్య సంబంధాలను తెంచుకోవడానికి ఆస్ట్రేలియా ముందుకు వచ్చింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును నిలిపివేస్తామని ఆస్ట్రేలియా రిఫైనర్ వివా ఎనర్జీ మంగళవారం తెలిపింది. ఉక్రెయిన్ దేశంపై దండయాత్ర తర్వాత మాస్కోపై విధించిన ఆంక్షలను అనుసరించి రష్యాతో వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయడానికి ఆస్ట్రేలియాలోని రిఫైనర్ వివా అంగీకరించింది. ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనికదాడి ప్రారంభమైనప్పటి నుంచి రష్యన్ ముడి చమురు, ఉత్పత్తులను కొనుగోలు చేయలేదని ఆస్ట్రేలియా యొక్క ఏకైక రిఫైనర్ అయిన అంపోల్ ప్రతినిధి తెలిపారు.


షెల్ బ్రాండ్‌తో ఆస్ట్రేలియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివా ఉక్రెయిన్‌పై రష్యా దాడి చర్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ మిత్రదేశాలు రష్యా చమురు దిగుమతులను నిషేధించడాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. 


Updated Date - 2022-03-08T17:59:22+05:30 IST