ఆ నీళ్లు వాడితే బ్లాక్ ఫంగస్ బారిన పడతారా..?

ABN , First Publish Date - 2021-05-15T23:51:14+05:30 IST

ప్రస్తుత కరోనా సమయంలో బాధితులకు అత్యంత అవసరం ఆక్సిజన్. ఈ ఆక్సిజన్‌ను ఆక్సిజన్ హ్యూమిడిఫయ్యర్ల ద్వారా అందించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుంత ఇవే అనేకమంది బాధితుల పాలిట శాపాలుగా..

ఆ నీళ్లు వాడితే బ్లాక్ ఫంగస్ బారిన పడతారా..?

ప్రస్తుత కరోనా సమయంలో బాధితులకు అత్యంత అవసరం ఆక్సిజన్. ఈ ఆక్సిజన్‌ను ఆక్సిజన్ హ్యూమిడిఫయ్యర్ల ద్వారా అందించాల్సి ఉంటుంది. అయితే ప్రాణాలు కాపాడేందుకు వాడుతున్న ఈ హ్యూమిడిఫయర్లే అనేకమంది బాధితుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. బ్లాక్ ఫంగస్ బారిన పడేలా చేస్తున్నాయి. సాధారణంగా ఆక్సిజన్ హ్యూమిడిఫయర్లలో స్టెరైల్ వాటన్ నింపాలి. కానీ ప్రస్తుతం అనేక ప్రైవేటు ఆసుపత్రుల్లో, ఇళ్లలో చికిత్స తీసుకుంటున్న అనేకమంది ఈ హ్యుమిడిఫయర్లలో సాధారణ నీటిని వాడేస్తున్నారు. ఇలా వాడడం వల్ల ఆ నీటిలో ఉన్న సూక్షక్రిములు, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి అనేక హానికారక జీవులు నేరుగా శ్వాసకోశంలోకి చేరే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఇలాంటి ప్రమాదాల వల్లే బ్లాక్ ఫంగస్ కూడా విజృంభిస్తోందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.


తాజాగా అహ్మదాబాద్‌కు చెందిన సీనియర్‌ హృద్రోగ చికిత్స నిపుణులు డాక్టర్‌ అతుల్‌ అభ్యంకర్‌ దీనిపై స్పందించారు. బ్లాక్‌ ఫంగస్‌ వ్యాప్తికి ప్రధాన కారణం ఆక్సిజన్‌కు ఉపయోగించే హ్యుమిడిఫయర్లేనని, వాటిలో స్టెరైల్‌ నీటినే ఉపయోగించాలని చెప్పారు. అయితే ప్రైవేటు ఆసుపత్రులు, కొవిడ్‌ ఐసోలేషన్‌ కేంద్రాలు, ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్న బాధిుతులు ఈ హ్యూమిడిఫయర్లలో సాధారణ నల్లా నీటినే వినియోగిస్తున్నారని, దీనివల్ల అందులో ఉండే రకరకాల సూక్ష్మజీవులు శరీరంలోకి చేరి ఫంగస్‌ ఏర్పడుతోందని అతుల్ వెల్లడించారు.


 ‘హ్యుమిడిఫయర్లలో స్టెరైల్ నీటినే వినియోగించాలి. 24 గంటల్లో రెండుసార్లు నీటని మార్చాలి. ఎప్పటికప్పుడు హ్యుమిడిఫయర్‌ను శుభ్రం చేయాలి. అప్పుడే సూక్ష్మజీవులు, బాక్టీరియాలు, ఫంగస్‌ల నుంచి రక్షణ పొందగలుగుతాం’ అని అతుల్ అభ్యంకర్ సూచించారు. కరోనా చికిత్సలో బాధితులకు పెద్ద మొత్తంలో స్టెరాయిడ్స్‌ ఇస్తారని, వాటి దుష్పభ్రావాల కారణంగా శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని, ఈ క్రమంలోనే మ్యూకోర్‌మైకోసిస్‌ దాడి చేయడానికి సులభమవుతోందని చెప్పారు.


కళ్లు, ముక్కు, మెదడు, పళ్లపై ప్రభావం ఈ ఫంగి చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో అనేకమంది ఆవు పేడను, మూత్రాన్ని శరీరానికి పూసుకుని, దానిని వైద్యంగా అభివర్ణిస్తున్నారని, కానీ ఆ విధానం వల్ల మ్యుకర్‌మైకోసిస్ మాత్రమే కాకుండా ఇతర ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లు కూడా దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 

Updated Date - 2021-05-15T23:51:14+05:30 IST