Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆయసాన్ని తగ్గించడానికి ఇది చక్కని ఔషధం

ఆంధ్రజ్యోతి(04-05-2020):

వైరస్‌లు అంటుకున్నప్పుడు జలుబు, దగ్గు, జ్వరం ముప్పేట దాడి చేస్తాయి. కఫం పేరుకోవడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుంది. దాంతో ఆయాసం వస్తుంది. ఇలాంటి ఆయాసాన్ని తగ్గించేందుకు వస చక్కగా పనిచేస్తుంది.

ఏం చేయాలి? : వస కొమ్మును దంచిన పొడి పావు చెంచా తీసుకుని ఒక గ్లాసు నీళ్లలో కలిపి టీ లాగా కాచుకుని తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కఫం తగ్గుతుంది. దగ్గు, జలుబు, తుమ్ములు రావు. విష దోషాలకు, వైరస్‌ దోషాలకు విరుగుడుగా పనిచేస్తుంది వస. రోజుకు రెండుమూడు సార్లు తాగితే ఊపిరితిత్తులు శక్తివంతమై, వైరస్‌ తాకిడిని తట్టుకోగలవు.

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement