Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీ చేసే మేలు

ఆంధ్రజ్యోతి(21-01-2021)

చలికాలంలో వేడి  వేడి  టీ తాగుతుంటే ఆ మజానే  వేరు. టీలలో రకరకాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని టీలు మన శరీరానికి చేసే మంచి ఏంటో చూద్దామా!


బ్లాక్‌ టీలో యాంటాక్సిడెంట్లు బాగా ఉంటాయి. ఇవి క్రానిక్‌ జబ్బుల బారిన పడకుండా కాపాడతాయి. బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది.


గ్రీన్‌ టీ శరీరంలోని ఎముకలను పటిష్టం చేస్తుంది. కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. జీర్ణ సమస్యలు తలెత్తవు. 


పిప్పరమెంట్‌ టీ ఒత్తిడిని నివారిస్తుంది. కండరాలను వదులు  చేసి నిద్ర బాగా పట్టడానికి సహకరిస్తుంది.


హైబిస్‌కస్‌ టీలో క్యాలరీలు ఉండవు. కెఫైన్‌ ఉండదు. ఈ టీలో పోషకాలు పుష్కలం. 


అల్లం టీలో ఖనిజాలు, విటమిన్‌-సి పుష్కలంగా ఉంటాయి.  వికారం, తలనొప్పి బాధలను తగ్గిస్తుంది.


ఛమోలీ టీ తాగితే కడుపునొప్పి నుంచి సాంత్వన పొందుతారు. స్త్రీలకు బహిష్టుసమయాల్లో తలెత్తే కడుపునొప్పిని కూడా ఇది నివారిస్తుంది. 


ఛాగా టీని పుట్టగొడుగులతో తయారుచేస్తారు. ఇమ్యూనిటీని పెంచుతుంది.


క్రిశాంతమమ్‌ టీ సువాసనలు వెదజల్లుతుంది. ఇది వాపుని తగ్గిస్తుంది.


Advertisement

Health Latest newsమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...