Advertisement
Advertisement
Abn logo
Advertisement

చిలగడ దుంపతో ఇన్ని ఉపయోగాలా?

ఆంధ్రజ్యోతి(16-02-2020)

ప్రశ్న: చిలగడ దుంపలు అందరూ తినవచ్చా? వాటిలోని పోషక విలువల గురించి తెలపండి. 

- సుమలత, హైదరాబాద్‌

జవాబు : చిలగడ దుంపలు కూర, పులుసు వంటివి చేసుకోవడానికి అనువుగా ఉంటాయి. వండటం తేలిక. తినడమూ తేలికే. రుచికి రుచి. అన్ని వయసుల వారూ ఇష్టంగా తినే దుంప ఇది. చిలగడ దుంపల్లో వివిధ రకాల పోషక పదార్థాలు ఉంటాయి. మిగతా దుంపజాతి కూరగాయల్లానే వీటిలో కూడా పిండి పదార్థాలు పుష్కలం. శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తాయీ పిండి పదార్థాలు. చిలగడదుంపల్లో అధిక మోతాదుల్లో ఉండే పీచుపదార్థం... జీర్ణక్రియకు, రక్తంలోని గ్లూకోజు పరిమాణాన్ని నియంత్రణలో ఉంచడానికి, గుండె జబ్బులను దూరంగా ఉంచడానికి, పెద్ద పేగుల క్యాన్సర్‌ను నివారించడానికి ఉపయోగపడుతుంది. ఈ దుంపల్లో రక్తపోటును నియంత్రించే పొటాషియం ఉంటుంది. కండరాలు, నాడుల పనితీరును మెరుగుపరిచే మెగ్నీషియంతో పాటు పిరిడాక్సిన్‌, బీటాకెరోటిన్‌, విటమిన్‌-సి వంటి రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లు కూడా అధికం. సాయంత్రం అల్పాహారంగానూ తీసుకోవచ్చు. సూప్స్‌లో గ్రైండ్‌ చేసి వేసుకోవచ్చు. వీటి చెక్కులో కూడా పోషకాలు ఉంటాయి.

డా.లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను

[email protected] కు పంపవచ్చు)

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...