స్వీట్‌కార్న్‌ తింటే ఇన్ని లాభాలా..!

ABN , First Publish Date - 2022-01-28T17:52:09+05:30 IST

వందగ్రాముల ఉడికించిన మొక్కజొన్న గింజల్లో దాదాపు వంద కెలోరీలు ఉంటాయి. అన్ని రకాల ముడిధాన్యాల్లానే మొక్కజొన్నలో

స్వీట్‌కార్న్‌ తింటే ఇన్ని లాభాలా..!

ఆంధ్రజ్యోతి(28-01-2022)

ప్రశ్న: స్వీట్‌ కార్న్‌ (మొక్కజొన్న) మంచిదేనా? అందులో పోషక విలువలు తెలియచేస్తారా?


- కరుణ, విజయనగరం


డాక్టర్ సమాధానం: వందగ్రాముల ఉడికించిన మొక్కజొన్న గింజల్లో దాదాపు వంద కెలోరీలు ఉంటాయి. అన్ని రకాల ముడిధాన్యాల్లానే మొక్కజొన్నలో కూడా పిండి పదార్థాలు అధికం. ఈ పిండిపదార్థాల్లో భాగంగానే కొంత చక్కెర మొక్కజొన్న గింజల్లో ఉంటుంది. మొక్కజొన్న గింజల్లో, పేలాల్లో కూడా పీచుపదార్థాలు ఉంటాయి. బీ- 3, బీ- 5, బీ-6, బీ- 9 మొదలైన విటమిన్లు; పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్‌, జింక్‌ లాంటి ఖనిజాలు మొక్కజొన్న గింజల్లో, పేలాల్లోనూ లభిస్తాయి. అధిక పిండి పదార్థాల వల్ల మధుమేహం ఉన్న వారు వివిధ రకాల ధాన్యాలతో పాటు మొక్కజొన్నను కూడా పరిమిత మోతాదులోనే తీసుకోవాలి. మొక్కజొన్నలానే బేబీ కార్న్‌లో కూడా పిండి పదార్థాలు ఉంటాయి. ప్రొటీన్లు, పీచుపదార్థాలు ఎక్కువ. కొవ్వులు చాలా తక్కువ. బేబీకార్న్‌లో థయామిన్‌, రిబోఫ్లావిన్‌, ఫోలిక్‌ ఆసిడ్‌, నయాసిన్‌ లాంటి బీ విటమిన్లు ఉండడం వల్ల, ఇది శక్తినిచ్చే ఆహారంగా ఉపయోగ పడుతుంది. వీటిలోని విటమిన్‌- సి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. కూరలు, మిగతా కూరగాయలతో కలిపి వీటిని వండితే అన్ని పోషకాలు యధాతథంగా ఉంటాయి. కానీ నూనెలో డీప్‌ ఫ్రై చేస్తే మాత్రం పోషకాలు తగ్గుతాయి. పిల్లలకు ఇది మంచి స్నాక్‌. మొక్కజొన్న కంటే బేబీకార్న్‌లో పిండి పదార్థాలు తక్కువ. కాబట్టి వీటిని కూరగాయలతో సమంగా వాడుకోవచ్చు. అన్ని వయసుల వారు తినవచ్చు. పీచుపదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల, జీర్ణాశయ ఆరోగ్యానికి, రక్తంలో చక్కర స్థాయి అదుపులో ఉంచడానికి స్వీట్‌కార్న్‌ మంచిది.  


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు) 


Updated Date - 2022-01-28T17:52:09+05:30 IST