రోజూ గుప్పెడు తింటే బోలెడు ప్రయోజనాలు!

ABN , First Publish Date - 2022-06-01T19:36:32+05:30 IST

పెసర్లలో పోషకాలు మెండుగా ఉంటాయి. మొలకెత్తించిన పెసర్లు రోజు గుప్పెడు తింటే బోలెడు ప్రయోజనాలు చేకూరతాయని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంకా ఏం చెబుతున్నారంటే...

రోజూ గుప్పెడు తింటే బోలెడు ప్రయోజనాలు!

ఆంధ్రజ్యోతి(01-06-2022)

పెసర్లలో పోషకాలు మెండుగా ఉంటాయి. మొలకెత్తించిన పెసర్లు రోజు గుప్పెడు తింటే బోలెడు ప్రయోజనాలు చేకూరతాయని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంకా ఏం చెబుతున్నారంటే...


పెసర్లలో ఇరవై మూడుశాతం ప్రొటీన్లు ఉంటాయి. క్యాల్షియం, మాంగనీసు, ఐరన్‌.. లాంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఫలితంగా శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది.మొలకెత్తిన పెసర్లు తింటే  రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పెసర్లను ఉడకబెట్టి గుగ్గుళ్ల రూపంలో తినొచ్చు.పెసర్లను వేయించి మెత్తని పిండిలా చేసి మేనికి రాసుకుంటే అలర్జీల సమస్య ఉండదు. చర్మం కాంతివంతం అవుతుంది.పెసర్లు తినడం వల్ల కండరాల పనితీరు మెరుగుపడుతుంది.


మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. త్వరగా ఆకలి వేయదు. దీనివల్ల బరువు తగ్గుతారు. బీపీ అదుపులో ఉంటుంది. చర్మ సమస్యలు, దద్దుర్లు, చెమటకాయలతో బాధపడేవాళ్లు పెసర్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. వేడిని తగ్గించే గుణం పెసర్లకు ఉంది. ఆహారంలోని విషదోషాలకు విరుగుడుగా పెసర్లను చైనీయులు ఉపయోగిస్తారు. శరీరంలోని అనవసరమైన వ్యర్థాలను తొలగించే గుణం వీటికి ఉంది. 

Updated Date - 2022-06-01T19:36:32+05:30 IST