ధ్యానం ఎక్కడైనా!

ABN , First Publish Date - 2020-02-12T06:29:08+05:30 IST

ఒత్తిడిలో ఉన్నప్పుడు కాసేపు ధ్యానం చేస్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలిసిందే. ఉదయం మాత్రమే కాకుండా సమయుం చిక్కిన్నప్పుడు ఎక్కడైనా ధ్యానం చేయవచ్చు.

ధ్యానం ఎక్కడైనా!

ఒత్తిడిలో ఉన్నప్పుడు కాసేపు ధ్యానం చేస్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలిసిందే. ఉదయం మాత్రమే కాకుండా సమయుం చిక్కిన్నప్పుడు ఎక్కడైనా ధ్యానం చేయవచ్చు. 

ఆఫీసులో: లంచ్‌ తరువాత బ్రేక్‌లో మీరు కూర్చున్న చోటనే ధ్యానం చేయొచ్చు. కుర్చీలో వెనక్కి నిటారుగా కూర్చోవాలి. మోకాళ్లు 90 డిగ్రీల కోణంలో ఉండాలి. తల, మెడ వెన్నుపూస నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు చేతుల్ని నడుముకు ఇరువైపులా ఉంచాలి. ఈ ధ్యానంతో ఆలోచనలు అదుపులో ఉంటాయి.

నిల్చొని: నిటారుగా నిల్చొని కాళ్లను కొద్దిగా దూరంగా పెట్టాలి. ఇప్పుడు మెకాళ్లను కొద్దిగా ముందుకు వంచి గట్టిగా శ్వాస తీసుకోవాలి. చేతుల్ని పొట్ట మీద ఉంచితే శ్వాసలోని రిథమ్‌ తెలుస్తుంది. ఇలా కొంచెం సమయం చేస్తే రిలీఫ్‌గా ఉంటుంది.

మోకాళ్ల మీద కూర్చొని: ఈ భంగిమలో వీపు భాగం నిటారుగా ఉంటుంది. ఇప్పుడు చేతుల్ని నేలకు ఆనించి, కాళ్లను వెనక్కి ఉంచాలి.  

నేలపై పడుకొని:  నేల మీద పడుకుని. కాళ్లు, చేతుల్ని కొద్దిగా దూరం జరపాలి. అవసరమైతే మోకాళ్ల కింద దిండు పెట్టుకుని స్ర్టెచ్‌ చేయొచ్చు. 

Updated Date - 2020-02-12T06:29:08+05:30 IST