Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

బెల్లంతో నవ లాభాలు

twitter-iconwatsapp-iconfb-icon
బెల్లంతో నవ లాభాలు

ఆంధ్రజ్యోతి(26-10-2020)

దసరా వచ్చిందంటే చాలు... బూరెలు, పాయసం, చక్కెరపొంగలి, పరమాన్నం ఇలా ఎన్నో రకాల తీపి వంటకాలు  చేస్తారు. కానీ వాటి తయారీలో బెల్లం ఉన్నా ఎక్కువమంది పంచదార వైపే మొగ్గుచూపుతారు.   ఆరోగ్యానికి బెల్లమే మంచిది.. 


రక్తశుద్ధికి...

బెల్లాన్ని తరచూ తింటే రక్తశుద్ధి జరుగుతుంది. హిమోగ్లోబిన్‌ స్థాయులు పెరగడానికి ఇది సహకరిస్తుంది. అంతేకాదు రక్తపోటును అదుపులో ఉంచుతుంది.


జీర్ణక్రియకు తోడ్పాటు

శీతాకాలంలో జీర్ణక్రియ మందగిస్తుంది. దాని వల్ల మలబద్ధకం, అజీర్తి, కడుపుబ్బరం వంటి సమస్యలు ఏర్పడతాయి. బెల్లం తినడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగి సమస్యలు దూరమవుతాయి. 


శక్తిమూలం

బెల్లంలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. రోజూ చిన్న బెల్లం ముక్క తినడం అలవాటు చేసుకుంటే నీరసం మీ దరిచేరదు. 


రోగ నిరోధకశక్తి పెరిగేందుకు...

బెల్లంలో జింక్‌, సెలీనియం వంటి ఖనిజాలతో పాటూ, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి వైరస్‌, బ్యాక్టీరియాలతో పోరాడే శక్తిని అందిస్తాయి. 


మతిమరుపునకు మందు... 

మతిమరుపుతో (డిమెన్షియా) బాధపడుతున్నవారు రోజూ బెల్లం ముక్క తినాలి. ఇందులో మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది. రోజూ పరగడుపునే కాస్త నేతిలో ముంచుకుని బెల్లం ముక్కని తింటే మంచి ఫలితాలు వస్తాయి.


చక్కటి క్లెన్సర్‌లా...

బెల్లం శరీరంలో క్లెన్సర్‌లా పనిచేస్తుంది. కాలేయం, ఊపిరితిత్తులు, పేగులు, పొట్ట, శ్వాసకోశనాళం వంటి ముఖ్యమైన భాగాల్లోని మలినాలను తొలగించేందుకు సహకరిస్తుంది. 


బరువు తగ్గేందుకు...

బెల్లంలో పొటాషియం ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో నీరు చేరకుండా అడ్డుకుంటుంది. తద్వారా బరువు తగ్గచ్చు. 


దగ్గు, జలుబుకు...

రాత్రి పడుకోబోయే ముందు రోజూ ఒక స్పూను తరిగిన బెల్లాన్ని తింటే మంచి ఫలితాలు ఉంటాయి. దగ్గు, జలుబుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 


రక్తహీనతకు చెక్‌

రక్తహీనతతో బాధపడేవాళ్లు బెల్లాన్ని తింటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. బెల్లంలో ఇనుము శాతం ఎక్కువ. ఇది ఎర్రరక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ప్రత్యేకంLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.