Advertisement
Advertisement
Abn logo
Advertisement

అనేక రంగుల్లో లభ్యమయ్యే వంకాయ వల్ల లాభాలేమిటి?

ఆంధ్రజ్యోతి(02-03-2020)

ప్రశ్న: అనేక రంగుల్లో లభ్యమయ్యే వంకాయ వల్ల లాభాలేమిటి?


- సుభద్ర, తిరుపతి


జవాబు: ఊదాలోనే కాకుండా పసుపు, తెలుపు, నలుపు, గులాబీ రంగులలో... రకరకాల ఆకారాల్లో... వంకాయలు దొరుకుతాయి. వీటిలో పీచుపదార్థాలు అధికం. బి-1, బి-6 విటమిన్లు ఎక్కువ. పొటాషియం, మెగ్నీషియం, కాపర్‌ కూడా విరివిగా లభిస్తాయి. 100 గ్రాముల వంకాయలలో 15 కెలోరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి బరువు నియంత్రణకు తగిన ఆహారం. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ప్రత్యేకించి ముదురు రంగు వంకాయ తొక్కలో నాసునిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ఇది జీవకణాలను నాశనం చేసే ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రిస్తుంది. మెదడు కణాల చుట్టూ ఉండే ఆవశ్యక కొవ్వులను కాపాడుతుంది. పిండిపదార్థాలు తక్కువ, పీచు పదార్థాలు ఎక్కువ కాబట్టి మధుమేహ పీడితులకు మంచివి. వీటిలోని పోలీఫినాల్స్‌ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. రక్తపోటును నిరోధించడంలో సాయపడతాయి. వంకాయలు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కొంత వరకు తగ్గిస్తాయి. వీటిలోని పోషక విలువలను పూర్తిగా పొందాలంటే మాత్రం, మూతపెట్టి ఉడికించాలి. లేదా తక్కువ నూనెతో మగ్గించి వండుకోవాలి.

 

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను

[email protected] కు పంపవచ్చు)

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...