Advertisement
Advertisement
Abn logo
Advertisement

తుమ్ములు రాకుండా అడ్డుకోవాలంటే..

ఆంధ్రజ్యోతి(04-05-2020):

ఈ తరానికి తెలుసో లేదో కానీ, పాతతరం వాళ్లకు గుర్తుంటుంది. అప్పటి పెళ్లిళ్లలో కర్పూరం పుల్లలు ఇచ్చేవాళ్లు. వాటి వాసన చూస్తే శుభకార్యం జరిగేప్పుడు ఎవరూ తుమ్మకుండా ఉంటారని చేసిన ఉపాయం అది. వైరస్‌లు వ్యాపించినప్పుడు తుమ్ములు, దగ్గు, జలుబు వంటివి వేధిస్తాయి. తుమ్ములు రాకుండా కర్పూరం అడ్డుకుంటుంది. 

ఎలా చేయాలి?: ఒక చెంచాడు బియ్యం, పావు చెంచా ముద్ద కర్పూరం బాగా కలిపి ఒక పల్చని వస్త్రంలో ఉంచి మూటగట్టి, వాసన చూస్తుంటే.. శ్వాసమార్గంలో కఫం చేరుకోకుండా ఉంటుంది. వైరస్‌ ఊపిరితిత్తుల్లో తిష్ట వేయకుండా శ్వాసనాళాల్ని శుభ్రం చేస్తుంది. ఆరోగ్యవంతులకు ఇది అవసరమైన సూచనే. ఇన్‌హేలర్లు వాడటం కన్నా ఇది సహజమైన పద్ధతి. ఇందులో కొద్దిగా వాము పొడిని కూడా చేర్చవచ్చు. ఇమ్యూనిటి పెంచుకోవడాకి ఇదొక మార్గం. 

Advertisement
Advertisement