ఇంగువతో బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే క్రమం తప్పకుండా వాడుతారు!

ABN , First Publish Date - 2021-11-11T18:47:15+05:30 IST

ఆహారపదార్థాల్లో ఇంగువ జోడిస్తే వంటలు ఘుమఘుమలాడతాయి. ఇంగువ వల్ల రుచే కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటంటే...

ఇంగువతో బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే క్రమం తప్పకుండా వాడుతారు!

ఆంధ్రజ్యోతి(11-11-2021)

ఆహారపదార్థాల్లో ఇంగువ జోడిస్తే వంటలు ఘుమఘుమలాడతాయి. ఇంగువ వల్ల రుచే కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటంటే...


పొట్ట ఉబ్బరం, గ్యాస్‌, కండరాలు పట్టేయడం వంటి సమస్యలకు ఇంగువ బాగా పనిచేస్తుంది. ఇందులో కార్మినేటివ్‌, యాంటీస్పాస్మోడిక్‌ గుణాలుంటాయి. ఇవి పొట్ట ఉబ్బరాన్ని తగ్గించి, నొప్పిని దూరం చేస్తాయి. జీర్ణశక్తి పెరిగేలా చేయడంలోనూ ఇంగువ ఉపయోగపడుతుంది. బైల్‌ ఉత్పత్తి పెరిగేలా చేసి ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.


మూత్రం అధికంగా వచ్చేలా చేయడం ద్వారా కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది డైయూరిటిక్‌గా పనిచేస్తుంది. అధికంగా ఉన్న క్రియాటినైన్‌, యూరియాను బయటకు పంపడంలో సహాయపడుతుంది.


కణుతులను తగ్గించడంలోనూ ఎఫెక్టివ్‌గా పనిచేస్తోందని అధ్యయనాల్లో తేలింది. లంగ్స్‌, లివర్‌, కిడ్నీ, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ల వ్యాప్తిని తగ్గించడంలోనూ పనిచేస్తున్నట్టు వెల్లడయింది. క్యాన్సర్‌ వల్ల బరువు కోల్పోయిన వారు తిరిగి బరువు పెరగడానికి సహాయపడుతుంది.


మహిళల రుతుసమస్యలకు ఇది మంచి హోమ్‌రెమెడీగా ఉపయోగపడుతుంది. అధిక రక్తపోటు, డయాబెటి్‌సను నియంత్రించడంలోనూ సహాయపడుతున్నట్టు పరిశోధనల్లో గుర్తించారు.


ఇంగువలో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రక్తనాళాల్లో వాపును తగ్గించడం ద్వారా తలనొప్పిని దూరం చేస్తాయి. ఒక గ్లాసు నీళ్లలో చిటికెడు ఇంగువ వేసుకుని తాగడం ద్వారా ఫలితం ఉంటుంది.


ఆస్తమాతో బాధపడే వారికి ఇది ఉపశమనాన్ని అందిస్తుంది. కఫం ఎక్కువగా ఉండటం, ఛాతీ పట్టేసినట్టుగా అనిపించినప్పుడు కాస్త ఇంగువను నీళ్లలో వేసి పేస్టులా చేసి ఛాతీపై రాయాలి. కొద్దిగా ఇంగువను శోంఠి, తేనెతో కలిపి తీసుకున్నా ఉపశమనం దొరుకుతుంది.

Updated Date - 2021-11-11T18:47:15+05:30 IST