మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు Fundamental right కాదు: అలహాబాద్ హైకోర్టు

ABN , First Publish Date - 2022-05-07T01:36:50+05:30 IST

మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగం ప్రాథమిక హక్కు కాదని అలహాబాద్..

మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు Fundamental right కాదు: అలహాబాద్ హైకోర్టు

అలహాబాద్: మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగం ప్రాథమిక హక్కు కాదని అలహాబాద్ హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. నూరి మసీదులో లౌడ్‌స్పీకర్ల వినియోగానికి అనుమతించాలని కోరుతూ బదౌన్‌కు చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌‌పై జస్టిస్ వివేక్ కుమార్ బిర్లా, జస్సిస్ వికాస్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పునిచ్చింది. అజాన్ అనేది ఇస్లాంలో ఒక భాగమే అయినప్పటికీ లాడ్‌స్పీకర్ల ద్వారా అజాన్ చేయడం ఇస్లాంలో భాగం కాదని కూడా కోర్టు స్పష్టం చేసింది. పిటిషన్ విచారణ యోగ్యం కాదని తాము భావిస్తున్నట్టు బెంచ్ పేర్కొంటూ  పిటిషన్‌ను కొట్టివేసింది.


ధోరన్‌పూర్ గ్రామంలోని నూరి మసీదులో Loud speakers ఏర్పాటుకు అనుమతి ఇచ్చేందుకు బదౌన్ ఎస్‌డీఎం గతంలో నిరాకరించారు. దీనిని హైకోర్టులో ఇర్ఫాన్ సవాలు చేశారు. ఎస్‌డీఎం ఉత్తర్వు చట్టవిరుద్ధమని, ప్రాథమిక, చట్టపరమైన హక్కులను ఉల్లంఘించడమేనని తన పిటిషన్‌లో ఇర్ఫాన్ వాదించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ తాజా తీర్పునిస్తూ, మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగం ఎంతమాత్రం Fundamental right కాదని స్పష్టం చేసింది.

Read more