Abn logo
Feb 25 2020 @ 16:00PM

అమెరికాలో రోడ్డు ప్రమాదం..హైదరాబాద్‌ దంపతుల మృతి

హైదరాబాద్: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌‌కు చెందిన  దంపతులు మృతి చెందారు. మృతులు ముషీరాబాద్‌ గాంధీనగర్‌కు చెందిన రాజు, దివ్యగా గుర్తించారు. డల్లాస్ నుంచి ప్రిస్కో వెళ్తుండగా రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement