Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sat, 20 Aug 2022 08:26:27 IST

Viral News: భార్యతో వెకేషన్‌కు వెళ్తే డబ్బులు ఖర్చవుతాయి కదా.. అతడికి మాత్రం అలా జరగలేదు.. రూ.2కోట్లతో ఇంటికి తిరిగెళ్లాడు!

twitter-iconwatsapp-iconfb-icon
Viral News: భార్యతో వెకేషన్‌కు వెళ్తే డబ్బులు ఖర్చవుతాయి కదా.. అతడికి మాత్రం అలా జరగలేదు.. రూ.2కోట్లతో ఇంటికి తిరిగెళ్లాడు!

ఇంటర్నెట్ డెస్క్: భార్యలు షాపింగ్ కోసం ప్లాన్ చేస్తుంటే సాధారణంగానే భర్తలు తమ జేబులు తడుముకుంటారు. అలాంటిది వెకేషన్‌కు వెళ్లాల్సి వస్తే.. ముందుగానే పెద్ద మొత్తంలో డబ్బులను సిద్ధం చేసుకుంటారు. సతీమణుల చిన్న చిన్న కోరికలు తీర్చి.. వారి కళ్లలో ఆనందం చూస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే.. అందరిలాగే ఓ వ్యక్తి కూడా తన భార్యతోపాటు సరదాగా వెకేషన్‌కు వెళ్లాడు. అక్కడ ఆమె సరదాలను తీర్చడానికి అవసరమైన డబ్బును తీసుకెళ్లాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వెకేషన్(vacation) ముగిసేసరికి అతడి జేబు ఖాళీ కాలేదు. పైగా రూ.2కోట్లతో ఇంటికి తిరిగెళ్లాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. అదెలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా? అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.


అమెరికా(America)కు చెందిన రీస్టర్(Reister), ఓసియన్ (Ocean) దంపతులు మేరీల్యాండ్‌(Maryland)లో నివసిస్తున్నారు. ఉద్యోగ రీత్యా రోజూ బిజీగా గడుపుతున్నా ఈ భార్యభర్తలు.. సరదాగా వెకేషన్‌కు వెళ్లాలని భావించారు. ఇందులో భాగంగానే స్థానికంగా ఉన్న ఓ వెకేషన్ స్పాట్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. ట్రిప్‌ను ప్లాన్ చేసుకుని ఇంట్లోంచి బయల్దేరారు. ఈ నేపథ్యంలోనే వెకేషన్ స్పాట్‌లో సరదాగా తిరుగుతూ.. రీస్టర్ అక్కడ ఉన్న ఓ దుకాణంలోకి వెళ్లాడు. అనంతరం 10 డాలర్లతో లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో అతడికి (Reister become a millianaire) జాక్‌పాట్ తగిలింది. ఏకంగా సుమారు రూ.2కోట్లు గెలుచుకున్నాడు. దీంతో అనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయిన అతడు.. విషయాన్ని తన భార్యకు చెప్పాడు. అయితే తొలుత అతడి మాటలను ఆమె నమ్మలేదు. కానీ లాటరీ టికెట్ చూపించడంతో.. నిజమే అని నమ్మి.. ఎగిరి గంతేసింది. ప్రస్తుతం ఈ వార్త స్థానికంగా చర్చనీయాంశం(Viral News) అయింది. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.