నాలుగో టీకా డోసు అవసరమవ్వచ్చు.. అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఫౌచీ

ABN , First Publish Date - 2022-02-11T03:02:54+05:30 IST

ఒమైక్రాన్‌పై పోరులో భాగంగా అమెరికాలో కరోనా టీకా నాలుగో డోసు ఇవ్వాల్సి రావచ్చని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు యాంటొనీ ఫౌచీ అభిప్రాయపడ్డారు.

నాలుగో టీకా డోసు అవసరమవ్వచ్చు.. అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఫౌచీ

ఇంటర్నెట్ డెస్క్: ఒమైక్రాన్‌పై పోరులో భాగంగా అమెరికాలో కరోనా టీకా నాలుగో డోసు ఇవ్వాల్సి రావచ్చని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు యాంటొనీ ఫౌచీ అభిప్రాయపడ్డారు. వ్యక్తుల వయసు, వారి ఆరోగ్య పరిస్థితుల మేరకు నాలుగో డోసు అవసరమా కాదా అనేది నిర్ణయించాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం శ్వేతసౌధంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా సంక్షోభం తీరుతెన్నులను నిశితంగా పరిశీలించి ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 


అమెరికాలో ఒమైక్రాన్‌ను ఆందోళన కారక వేరియంట్‌గా గుర్తించిన నాటి నుంచి లక్ష మందిని ఈ వైరస్ పొట్టనపెట్టుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. టీకా వేసుకున్న వారు కూడా వ్యాధి వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నప్పుడు మాస్కు ధరించాల్సి ఉంటుంది. అయితే..కరోనా ఒమైక్రాన్ వేవ్ నెమ్మదిస్తున్న నేపథ్యంలో అమెరికాలోని పలు రాష్ట్రాలు తప్పనిసరి మాస్కు నిబంధనను తొలగిస్తున్నాయి. 

Updated Date - 2022-02-11T03:02:54+05:30 IST