నా బిడ్డ అడిగినంత ఫుడ్ పెట్టరా అంటూ రెచ్చిపోయిన మహిళ..! స్కూల్లో ఒక్కసారిగా రేగిన కలకలం..! ఆమె చేసిందేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-04-27T02:16:02+05:30 IST

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ తన బిడ్డ చదువుతున్న స్కూల్ పేల్చేస్తానంటూ ఇటీవల ఓ వాయిస్ మెయిల్ పంపించడంతో ఆ స్కూల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.

నా బిడ్డ అడిగినంత ఫుడ్ పెట్టరా అంటూ రెచ్చిపోయిన మహిళ..! స్కూల్లో ఒక్కసారిగా రేగిన కలకలం..! ఆమె చేసిందేంటో తెలిస్తే..

ఎన్నారై డెస్క్: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ తన బిడ్డ చదువుతున్న స్కూల్ పేల్చేస్తానంటూ ఇటీవల ఓ వాయిస్ మెయిల్ పంపించడంతో ఆ స్కూల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ స్థాయిలో ఆమె వార్నింగ్ ఇవ్వడానికి కారణం.. స్కూల్ క్యాంటీన్ వాళ్లు ఆమె కుమారుడు అడిగినంత ఆహారం పెట్టకపోవడమే. అవును..ఇంత చిన్న విషయానికే ఆమె ఇలాంటి భయంకరమైన వార్నింగ్ ఇచ్చింది. తన కుమారుడు లాంటి ఎందరో పిల్లల్లు అదే స్కూల్లో చదువుతున్నారన్న విషయాన్ని మరిచి ఇలాంటి హెచ్చరిక చేసింది. కొకోవా స్కూల్‌లో ఈ ఘటన వెలుగు చూడగా..  ఇలా సైకో వార్నింగులు ఇచ్చిన మహిళ పేరు మెటోయా స్మిత్.. 


‘‘మీరు నా బిడ్డ అడిగినంత ఆహారం పెట్టకపోతే నేను ఈ స్కూల్‌ను బాంబుతో పేల్చేస్తా’’ అంటూ ఆమె ఇటీవల ఓ వాయిస్ మేల్ పంపించింది. దీంతో.. హడలెత్తిపోయిన హైస్కూల్ యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు స్కూల్ అంతా జల్లెడపట్టి.. ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. వాయిస్ మెయిల్‌లో స్మిత్.. తన పేరు ప్రస్తావించకుండా జాగ్రత్తపడింది. కానీ.. అధికారులు స్కూల్ రికార్డులు పరిశీలించి ఆమె నెంబర్ నుంచే వాయిస్ మెయిల్ వచ్చినట్టు నిర్ధారించారు.  


మరోవైపు.. స్మిత్ ఇలాంటి వార్నింగ్ అస్సలు ఇవ్వలేదంటూ ఆమె సోదరి చెప్పుకొచ్చింది. ఫిర్యాదులో పేర్కొన్న విద్యార్థి, ఫోన్ నెంబర్, వార్నింగ్ ఇచ్చిన మహిళ తన సోదరి కాదని  గట్టిగా వాదించింది. అంతేకాకుండా.. స్కూల్ రికార్డుల్లోని తప్పిదాల కారణంగా తన సోదరి అన్యాయంగా ఈ కేసులో ఇర్కుకుపోయిందని చెప్పింది. అయితే.. ఆ సందేశంలోని గొంతు ఆమెదేనని ఓ పోలీసు కూడా గుర్తుపట్టి  కేసు నమోదు చేశారు.   



Updated Date - 2022-04-27T02:16:02+05:30 IST