వైన్ షాప్ వినూత్న ఐడియా.. భౌతిక దూరం పాటించాలని చెప్పడంతో..

ABN , First Publish Date - 2020-04-09T23:34:12+05:30 IST

అమెరికాలో కరోనా మహమ్మారి నిత్యం ఏ విధంగా వ్యాప్తి చెందుతోందో చూస్తూనే ఉన్నాం.

వైన్ షాప్ వినూత్న ఐడియా.. భౌతిక దూరం పాటించాలని చెప్పడంతో..

మేరీల్యాండ్: అమెరికాలో కరోనా మహమ్మారి నిత్యం ఏ విధంగా వ్యాప్తి చెందుతోందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే అమెరికా ప్రభుత్వం భౌతిక దూరం పాటించాలంటూ ప్రజలను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మేరీల్యాండ్‌కు చెందిన ఓ వైన్ షాప్ వినూత్న ఐడియాతో ముందుకొచ్చింది. భౌతిక దూరం పాటిస్తూనే తమ వ్యాపారానికి నష్టం రాకుండా చూసుకుంటోంది. స్టోన్ హౌస్ అర్బన్ వైనరీ అనే వైన్ షాప్‌కు చెందిన యజమానులు కుక్కచేత వైన్‌ను డెలివరీ చేయిస్తున్నారు. 


ఎవరైతే వైన్ ఆర్డర్ చేస్తారో.. వారి ఇంటి పార్కింగ్ ఆవరణకు సోడా(కుక్క పేరు) వైన్‌ను తీసుకెళ్లి ఇస్తుందంటూ వారు చెప్పారు. ఒకేసారి రెండు వైన్ బాటిళ్లను సోడా మొసుకెళ్తుందని వారు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది. సోడా తమతో కూడా ఎంతో ఆప్యాయంగా మెలుగుతోందంటూ కస్టమర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ ఇలా సోడాతో డెలివరీ చేయించాలన్న ఐడియా రావడం బాగుందని వారు చెబుతున్నారు. సోడా కూడా ఆనందంగా తమకు వైన్ డెలివరీ చేస్తోందని కస్టమర్లు తెలిపారు.

Updated Date - 2020-04-09T23:34:12+05:30 IST