భారత్‌లో కరోనా కల్లోలం.. అమెరికా కీలక ప్రకటన!

ABN , First Publish Date - 2021-04-24T14:35:24+05:30 IST

కొవిడ్‌పై భారత్ చేస్తున్న పోరాటానికి తాము సాయం అందిస్తామని అమెరికా ప్రకటించింది. మహమ్మారిని అరికట్టేందుకు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ).. భారత్‌కు సాంకేతిక సహకారం అం

భారత్‌లో కరోనా కల్లోలం.. అమెరికా కీలక ప్రకటన!

వాషింగ్టన్: కొవిడ్‌పై భారత్ చేస్తున్న పోరాటానికి తాము సాయం అందిస్తామని అమెరికా ప్రకటించింది. మహమ్మారిని అరికట్టేందుకు  యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ).. భారత్‌కు సాంకేతిక సహకారం అందించడం ద్వారా సహాయపడుతుందని అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణుడు అంథోనీ ఫౌచీ వెల్లడించారు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ  వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా కొవిడ్ కేసుల సంఖ్య మూడు లక్షల మార్కును దాటేసిన నేపథ్యంలో అమెరికా ఈ ప్రకటన చేసింది. ఇదిలా ఉంటే.. భారత్‌కు సహాయం చేయాల్సిందిగా జో బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. అమెరికా  చట్టసభ సభ్యులతోపాటు పలువురు ఇండియన్ అమెరికన్లు భారత్‌కు అండగా నిలవాలని బైడెన్ సర్కార్‌ను కోరుతున్నారు. కొవిడ్ టీకాలను, ప్రాణాలను రక్షించే వైద్య సామాగ్రిని ఇండియాకు సరఫరా చేయాలని అమెరికా అధ్యక్షుడికి సూచిస్తున్నారు. 


Updated Date - 2021-04-24T14:35:24+05:30 IST