ప్రమాణ స్వీకారం తర్వాత.. కమల ఆసక్తికర ట్వీట్ !

ABN , First Publish Date - 2021-01-21T14:33:44+05:30 IST

కమలా దేవీ హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.

ప్రమాణ స్వీకారం తర్వాత.. కమల ఆసక్తికర ట్వీట్ !

వాషింగ్టన్: కమలా దేవీ హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. 'ప్రజా సేవకు సిద్ధం' అని ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 'రెడీ టు సర్వ్' అని షార్ట్ అండ్ స్వీట్‌గా సింగిల్ లైన్‌లో ఆమె తన తొలి సందేశాన్ని ట్వీట్ చేశారు. ఉపాధ్యక్షురాలిగా ప్రభుత్వ అధికారిక ఖాతా నుంచి కమల చేసిన తొలి ట్వీట్ కూడా ఇదే. ఇక దేశ 49వ ఉపాధ్యక్షురాలిగా బుధవారం కమలా హ్యారిస్(56) ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా, తొలి ఆఫ్రికన్‌-ఆమెరికన్‌గా, దక్షిణాసియా మూలాలున్న వ్యక్తిగా, భారతీయ మూలాలున్న వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు. 


కాగా, 2016లో కాలిఫోర్నియా సెనేటర్‌గా ఎన్నికైన కమల తొలిసారి యూఎస్ కాంగ్రెస్‌లో అడుగు పెట్టారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా కూడా పని చేశారు. ఓక్లాండ్‌లో జన్మించిన ఆమె.. 1986లో హోవార్డ్ యూనివర్శిటీ నుండి పొలిటికల్ సైన్స్‌ అండ్ ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. హారిస్ 2014లో ఎంటర్టైన్మెంట్ లాయర్ డగ్లస్‌ ఎంహోఫ్‌‌ను వివాహం చేసుకున్నారు. 



Updated Date - 2021-01-21T14:33:44+05:30 IST