బైట్‌డ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన అమెరికా!

ABN , First Publish Date - 2020-11-30T02:47:48+05:30 IST

చైనాకు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్‌ టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు అమెరికా గుడ్‌న్యూస్ చెప్పింది. టిక్‌టాక్‌ను అమెరికా సంస్థలకు అమ్మేందుకు గతంలో ఇచ్చిన గడువు ముగిసిపోవడం

బైట్‌డ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన అమెరికా!

వాషింగ్టన్: చైనాకు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్‌ టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు అమెరికా గుడ్‌న్యూస్ చెప్పింది.  టిక్‌టాక్‌ను అమెరికా సంస్థలకు అమ్మేందుకు గతంలో ఇచ్చిన గడువు ముగిసిపోవడంతో మరో వారం రోజులపాటు సమయమిచ్చింది. వివరాల్లోకి వెళితే.. దేశ భద్రత దృష్ట్యా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేశారు. నవంబర్ 12లోగా యాప్‌ను అమెరికా సంస్థలకు అమ్మేయాలని సూచించారు. లేని పక్షంలో నవంబర్ 12 తర్వాత టిక్‌టాక్ కార్యకలాపాలు అమెరికాలో నిలిచిపోతాయని హెచ్చరించారు. ఈ క్రమంలో టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గిన అమెరికా ప్రభుత్వం.. అమెరికా సంస్థలకు టిక్‌టాక్‌ను అమ్మేసేందుకు బైట్‌డ్యాన్స్‌కు ఇచ్చిన గడువును 15 రోజులపాటు పొడిగించింది. నవంబర్ 27తో ఈ గడువు కూడా ముగిసిపోయింది. ఈ క్రమంలో యూఎస్ ట్రెజరీ బైట్‌డ్యాన్స్‌కు మరో అవకాశం ఇచ్చింది. టిక్‌టాక్‌ను అమెరికా సంస్థలకు అమ్మేందుకు డిసెంబర్ 4 వరకు గడువు ఇచ్చింది. 


Updated Date - 2020-11-30T02:47:48+05:30 IST