శేష జీవితాన్ని భారత్‌లో గడపటం కోసం కోర్టును ఆశ్రయించిన అమెరికన్!

ABN , First Publish Date - 2020-07-09T04:48:37+05:30 IST

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా భారత్‌లో చిక్కుకున్న ఓ అమెరికన్.. కోర్టుకెక్కిన ఘటన ప్రస్తుతం ఆసక్తిగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహమ్మారిని క

శేష జీవితాన్ని భారత్‌లో గడపటం కోసం కోర్టును ఆశ్రయించిన అమెరికన్!

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా భారత్‌లో చిక్కుకున్న ఓ అమెరికన్.. కోర్టును ఆశ్రయించిన ఘటన ప్రస్తుతం ఆసక్తిగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహమ్మారిని కట్టడి చేయడానికి యావత్ ప్రపంచమే స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయింది. భారత ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేసింది. దీంతో లక్షలాది మంది భారతీయులు విదేశాల్లో చిక్కుకున్నారు. ఇదే సమయంలో కొందరు విదేశీయులు కూడా భారత్‌లో చిక్కుకున్నారు. అమెరికాకు చెందిన జానీ పాల్ పియర్స్ కూడా ఈ కోవకు చెందిన వారే. కరోనా విజృంభిణకు ముందు ఆయన టూరిస్ట్ వీసా మీద ఇండియాకు వచ్చారు. లాక్‌డౌన్ కారణంగా దాదాపు 5నెలలుగా ఆయన ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా.. ఒకవైపు భారత ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలు సడలించింది. మరోవైపు భారత్‌లో చిక్కుకున్న విదేశీలు.. ఆయా దేశ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తరలివెళ్తున్నారు. అయితే 74 ఏళ్ల జానీ పాల్ పియర్స్ మాత్రం.. తన శేష జీవితాన్ని ఇక్కడే గడిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం కేరళ హైకోర్టును కూడా ఆశ్రయించారు. తన టూరిస్ట్ వీసాను బిజినెస్ వీసాగా మార్చాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే ఈ విషయం స్పందించిన ఆయన.. ‘బిజినెస్ వీసా పొందడం ద్వారా ఐదు సంవత్సరాల వరకు నేను ఇక్కడే ఉండొచ్చు. భారతీయ మహిళను పెళ్లి చేసుకోవడం ద్వారా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ నా వయసు 74 సంవత్సరాలు కావడం వల్ల ఇప్పుడు అది సాధ్యం కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. 


Updated Date - 2020-07-09T04:48:37+05:30 IST