వచ్చే 12 నెలల్లో 8 లక్షల వీసాలు: అమెరికా

ABN , First Publish Date - 2022-04-20T13:03:04+05:30 IST

రానున్న 12 నెలల్లో భారత్‌లో 8 లక్షల వీసాలు జారీచేసే అవకాశం ఉందని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది.

వచ్చే 12 నెలల్లో 8 లక్షల వీసాలు: అమెరికా

చెన్నై, ఏప్రిల్‌ 19: రానున్న 12 నెలల్లో భారత్‌లో 8 లక్షల వీసాలు జారీచేసే అవకాశం ఉందని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. వీసా ప్రాసెస్‌ కోసం స్లాట్లు తెరిచామని సీనియర్‌ దౌత్యవేత్త డొనాల్డ్‌ ఎల్‌ హెల్ఫిన్‌ తెలిపారు. భారత్‌లోని రాయబార కార్యాలయాలను, సిబ్బందిని పెంచుతున్నామన్నారు. ‘హైదరాబాద్‌లో కొత్త ఆఫీసు ఏర్పాటు చేస్తున్నాం. న్యూఢిల్లీ, ముంబైల్లో సిబ్బందిని పెంచుతున్నాం. కోల్‌కతాలో ఇప్పటికే సిబ్బందిని రెట్టింపు చేశాం’ అని తెలిపారు.

Updated Date - 2022-04-20T13:03:04+05:30 IST