మరో 200 మిలియన్ల మోడెర్నా వ్యాక్సిన్ కొనుగోలు చేస్తున్న అమెరికా

ABN , First Publish Date - 2021-06-17T04:59:53+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా మరో 200 మిలియన్ల డోసుల మోడెర్నా వ్యాక్సిన్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వివిధ వేరియంట్ల కోసం ప్రత్యేకంగా తయారుచేస్తున్న వ్యాక్సిన్లను ఎంచుకునే అవకాశం కూడా అమెరికాకు ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

మరో 200 మిలియన్ల మోడెర్నా వ్యాక్సిన్ కొనుగోలు చేస్తున్న అమెరికా

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా మరో 200 మిలియన్ల డోసుల మోడెర్నా వ్యాక్సిన్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వివిధ వేరియంట్ల కోసం ప్రత్యేకంగా తయారుచేస్తున్న వ్యాక్సిన్లను ఎంచుకునే అవకాశం కూడా అమెరికాకు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ డోసుల కొనుగోలుతో అగ్రరాజ్యం ఇప్పటి వరకూ కొనుగోలు చేసిన ఈ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 500 మిలియన్లకు చేరనుంది. ఒక్కో వ్యక్తికి ఈ వ్యాక్సిన్ రెండు డోసులు ఇవ్వాలి. ఇప్పటి వరకూ మొత్తం 217 మిలియన్ వ్యాక్సిన్‌ డోసులను ఈ కంపెనీ అమెరికాకు అందించింది. మరో 110 మిలియన్ డోసులను ఈ ఏడాది చివరిలోపు డెలివరీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరో 90 మిలియన్ డోసులను వచ్చే ఏడాది తొలి మూడు నెలల్లో అందించనుందని కంపెనీ తెలిపింది.

Updated Date - 2021-06-17T04:59:53+05:30 IST