American గగనతలం నుంచి రష్యా విమానాల రాకపోకలపై నిషేధం

ABN , First Publish Date - 2022-03-02T12:46:23+05:30 IST

అమెరికా గగనతలం నుంచి రష్యా విమానాల రాకపోకలపై అమెరికా నిషేధం విధించింది...

American గగనతలం నుంచి రష్యా విమానాల రాకపోకలపై నిషేధం

వాషింగ్టన్ : అమెరికా గగనతలం నుంచి రష్యా విమానాల రాకపోకలపై అమెరికా నిషేధం విధించింది. ఐరోపా సమాఖ్య, కెనడా దేశాలు తమ గగనతలంపై నుంచి రష్యా విమానాలు రాకపోకలు సాగించకుండా నిషేధించిన తర్వాత యూఎస్ ఈ దిశగా చర్యలు తీసుకుంది. మంగళవారం యునైటెడ్ ఎయిర్‌లైన్స్ రష్యా తమ గగనతలం మీదుగా యూఎస్ విమానాలు ప్రయాణించడాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది.ఈ పరిణామంపై వ్యాఖ్యానించడానికి వైట్‌హౌస్ నిరాకరించింది.యునైటెడ్ అమెరికా ఇటీవల భారతదేశంతోపాటు  బయటి దేశాలకు కొన్ని విమానాలను నడపడానికి రష్యా గగనతలం మీదుగా ప్రయాణించడం కొనసాగించింది. డెల్టా ఎయిర్ లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, యునైటెడ్ పార్సెల్ సర్వీస్ రష్యా మీదుగా విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు యూఎస్ ధృవీకరించింది.యునైటెడ్ అమెరికా మంగళవారం, బుధవారాల్లో భారతదేశానికి వెళ్లాల్సిన రెండు విమానాలను రద్దు చేసింది.


Updated Date - 2022-03-02T12:46:23+05:30 IST