ఒక్క మెయిల్‌తో విద్యార్థిని ఇంటి ముందు వాలిపోయిన ఉపాధ్యాయుడు.. విషయం ఏంటంటే!

ABN , First Publish Date - 2020-04-04T01:19:15+05:30 IST

అమెరికాలో ఓ వైపు కరోనా విలయతాడం చేస్తోంటే.. 12ఏళ్ల అమ్మాయికి మాత్రం ఓ పెద్ద సమస్యే వచ్చింది. ఆ అమ్మాయి తన సమస్యను ఉపాధ్యాయుడి దృష్టికి తీసుకె

ఒక్క మెయిల్‌తో విద్యార్థిని ఇంటి ముందు వాలిపోయిన ఉపాధ్యాయుడు.. విషయం ఏంటంటే!

వాషింగ్టన్: అమెరికాలో ఓ వైపు కరోనా విలయతాడం చేస్తోంటే.. 12ఏళ్ల అమ్మాయికి మాత్రం ఓ పెద్ద సమస్యే వచ్చింది. ఆ అమ్మాయి తన సమస్యను ఉపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో  బోర్డు, మార్కర్‌తో ఆ ఉపాధ్యాయుడు ఆమె ఇంటి ముందు వాలిపోయాడు. ఏంటీ కాస్త గందరగోళంగా ఉందా? అయితే పూర్తి వివరాలు మీకోసం. అమెరికాలోని సౌత్ డకోటా ప్రాంతానికి చెందిన రేలీ అండర్సన్(12), స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కవ ఉన్నందున పాఠశాలలన్నీ మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఉండే చదువుకుంటున్న రేలీ అండర్సన్‌కు.. ఆల్‌జీబ్రాలోని సమస్యకు గ్రాఫ్ ఎలా గీయాలో అర్థం కాలేదు. దీంతో ఆమె వెంటనే లెక్కల మాస్టర్‌ క్రిస్ వాబాకు మెయిల్ ద్వారా తన సమస్యను వివరించింది.


రేలీ అండర్సన్ మెయిల్‌కు స్పందించిన క్రిస్ వాబా.. ఓ తెల్లటి బోర్డు, మార్కర్‌తో ఆ అమ్మాయి ఇంటి ముందు వాలిపోయాడు. అంతేకాకుండా కరోనా కట్టడికి ప్రభుత్వం సూచించిన సామాజిక దూరం పాటిస్తూనే.. ఇంటి గుమ్మంలో బోర్డుపెట్టి, గ్రాఫ్ ఎలా గీయాలో రేలీ అండర్సన్‌కు వివరించాడు. రేలీ అండర్సన్ కూడా ఇంట్లోనే ఉండి.. లెక్కల మాస్టర్ చెప్పిన విషయాల్ని జాగ్రత్తగా నోట్ చేసుకుంది. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా.. క్రిస్ వాబాను ‘టీచర్ ఆఫ్ ది ఇయర్’ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.  


Updated Date - 2020-04-04T01:19:15+05:30 IST