Covid-19ను తేలికగా తీసుకొవద్దు.. 10మంది కుటుంబ సభ్యులను పొగొట్టుకున్నా: వివేక్ మూర్తి

ABN , First Publish Date - 2021-07-16T19:24:09+05:30 IST

మహమ్మారి కరోనాను తేలికగా తీసుకొవద్దని, వైరస్ వల్ల తన 10మంది కుటుంబ సభ్యులను పొగొట్టుకున్నానని అమెరికా సర్జన్ జనరల్, ఇండియన్ అమెరికన్ డా. వివేక్ మూర్తి అన్నారు. కరోనా టీకాలు తీసుకునేందుకు కొంతమంది అమెరికన్లు వెనుకాడుగు వేస్తుండడం ఆందోళన కలిగిస్తుందని చెప్పిన ఆయన.. ప్రాణాంతకమైన కోవిడ్-19 నుంచి మనల్ని కాపాడేది కేవలం వ్యాక్సిన్ మాత్రమేనని పేర్కొన్నారు.

Covid-19ను తేలికగా తీసుకొవద్దు.. 10మంది కుటుంబ సభ్యులను పొగొట్టుకున్నా: వివేక్ మూర్తి

వాషింగ్టన్: మహమ్మారి కరోనాను తేలికగా తీసుకొవద్దని, వైరస్ వల్ల తన 10మంది కుటుంబ సభ్యులను పొగొట్టుకున్నానని అమెరికా సర్జన్ జనరల్, ఇండియన్ అమెరికన్ డా. వివేక్ మూర్తి అన్నారు. కరోనా టీకాలు తీసుకునేందుకు కొంతమంది అమెరికన్లు వెనుకాడుగు వేస్తుండడం ఆందోళన కలిగిస్తుందని చెప్పిన ఆయన.. ప్రాణాంతకమైన కోవిడ్-19 నుంచి మనల్ని కాపాడేది కేవలం వ్యాక్సిన్ మాత్రమేనని పేర్కొన్నారు. కరోనా మరణాలు తగ్గించాలంటే టీకాలు వేసుకోవడం తప్పనిసరి అన్నారు. వైరస్‌కు 10 మంది సొంత కుటుంబ సభ్యులను కోల్పోవడం చాలా బాధ కలిగించిందని, ఇలాంటి పరిస్థితి మరో ఫ్యామిలీకి రావొద్దన్నారు. టీకాల విషయంలో అపోహలను పక్కన బెట్టి, అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రస్తుతం మన జీవితాలు వ్యాక్సిన్‌పైనే ఆధారపడి ఉన్నయని మూర్తి పేర్కొన్నారు. 


ఇప్పటివరకు అమెరికా వ్యాప్తంగా 160 మిలియన్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి కావడం గుడ్‌న్యూస్ అని చెప్పారు. కానీ, ఇంకా మనం సంక్షోభం నుంచి బయటపడలేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇప్పటికీ మిలియన్ల మంది అమెరికన్లు వ్యాక్సిన్ వేసుకోని విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీకా వేసుకోని వారి వల్లే వైరస్ మరింత ప్రబలుతోందని చెప్పారు. వ్యాక్సిన్ల విషయంలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దని మూర్తి ప్రజలను కోరారు. ఇలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. టీకాలు కరోనా నుంచి రక్షణ కల్పిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని, ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవడం తప్పనిసరి అన్నారు.   

Updated Date - 2021-07-16T19:24:09+05:30 IST