Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమెరికా సర్జన్ జనరల్‌గా వివేక్ మూర్తి

వివేక్ మూర్తిని సర్జన్ జనరల్‌గా ధృవీకరించిన యూఎస్ సెనేట్

వాషింగ్టన్: భారతీయ అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తిని సర్జన్ జనరల్‌గా అమెరికా సెనేట్ మంగళవారం ధృవీకరించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. వివేక్ మూర్తిని సర్జన్ జనరల్‌గా నామినేట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం ఆయన నామినేషన్‌ను ధృవీకరించేందుకు సెనేట్‌లో ఓటింగ్ నిర్వహించారు. దాంతో 57 మంది సెనేటర్లు వివేక్ మూర్తికి అనుకూలంగా ఓటు వేయగా, 43 మంది సెనేటర్లు వ్యతిరేకించారు. రిపబ్లికన్ సెనేటర్లు బిల్ కాసిడీ, సుసాన్ కొలిన్స్, రోజర్ మార్షల్, లిసా ముర్కోవిస్కి, రాబ్ పోర్ట్మన్, మిట్ రోమ్నీ, డాన్ సుల్లివన్.. వివేక్‌కు అనుకూలంగా ఓటు వేయడంతో 57-43 తేడాతో సర్జన్ జనరల్‌గా ఎన్నికయ్యారు. ఇక మరోసారి తనకు ఈ పదవి దక్కడం పట్ల వివేక్ మూర్తి హర్షం వ్యక్తం చేశారు. కాగా, బరాక్ ఒబామా హయాంలో కూడా వివేక్ మూర్తి సర్జన్ జనరల్‌గా పనిచేశారు. అయితే, 2017లో ట్రంప్ ఆయనను తొలగించారు. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement