తాలిబన్ల దూకుడు తగ్గించడంపై దృష్టి పెట్టాలి : ఆఫ్ఘన్‌కు ఆమెరికా సలహా

ABN , First Publish Date - 2021-07-25T17:30:41+05:30 IST

తాలిబన్ల నుంచి భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి

తాలిబన్ల దూకుడు తగ్గించడంపై దృష్టి పెట్టాలి : ఆఫ్ఘన్‌కు ఆమెరికా సలహా

వాషింగ్టన్ : తాలిబన్ల నుంచి భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ముందు వారి దూకుడుకు కళ్ళెం వేయడంపై దృష్టి సారించాలని ఆఫ్ఘనిస్థాన్ దళాలకు అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ సలహా ఇచ్చారు. తాలిబన్లు ముఖ్యమైన ప్రాంతాల్లో తమ పట్టు పెంచుకుంటున్నారని చెప్పారు. ఆఫ్ఘన్ దళాలు తాలిబన్లను ఆపుతాయా? లేదా? అనే విషయంలో మొదట చేయవలసినది తాలిబన్ల దూకుడును తగ్గించడమని తాను భావిస్తున్నానన్నారు. ఆఫ్ఘన్లకు శక్తి, సామర్థ్యాలు ఉన్నాయని, పురోగతి సాధించే సామర్థ్యం ఉందని చెప్పారు. ఏం జరుగుతుందో చూద్దామన్నారు. అలాస్కాలో శనివారం విలేకర్లతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


ఇదిలావుండగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆఫ్ఘన్ సేనలకు ఆర్థిక సాయం చేసేందుకు హామీ ఇచ్చారు. నిలిచిపోయిన శాంతి చర్చల పునరుద్ధరణకు దౌత్యపరమైన కృషిని రెట్టింపు చేస్తామని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితి వల్ల ఉత్పన్నమైన అవసరాలను తీర్చుకునేందుకు 100 మిలియన్ డాలర్ల అత్యవసర ఆర్థిక సాయాన్ని శుక్రవారం ప్రకటించారు. 


Updated Date - 2021-07-25T17:30:41+05:30 IST