Pegasus row: స్పైవేర్‌ వాడకంపై అమెరికా స్పందన ఇదీ!

ABN , First Publish Date - 2021-07-26T06:59:28+05:30 IST

ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టడం కోసం ఇజ్రాయెల్‌కు చెందిన నిఘా సంస్థ ఎన్‌ఎస్‌వో తయారు చేసిన స్పైవేర్ ‘పెగాసస్’.

Pegasus row: స్పైవేర్‌ వాడకంపై అమెరికా స్పందన ఇదీ!

వాషింగ్టన్: ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టడం కోసం ఇజ్రాయెల్‌కు చెందిన నిఘా సంస్థ ఎన్‌ఎస్‌వో తయారు చేసిన స్పైవేర్ ‘పెగాసస్’. దీన్ని పలుదేశాలు ప్రముఖ వ్యక్తులపై నిఘా పెట్టడం కోసం ఉపయోగించాయనే వార్తలు ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తున్నాయి. భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కూడా పెగాసస్ రగడే ప్రధానాంశంగా మారింది. ఈ క్రమంలో ఇలా సామాన్య ప్రజానీకం, విమర్శకులు, జర్నలిస్టులపై ఇలాంటి స్పైవేర్ వాడకం అనేది చాలా ఆందోళనకరమైన అంశమని అగ్రరాజ్యం అమెరికా వ్యాఖ్యానించింది. భారత్‌లో స్పైవేర్ వాడకం గురించి ప్రస్తావించగా.. తమ వద్ద భారత్‌కు సంబంధించిన ప్రత్యేక వివరాలేవీ లేవని పేర్కొంది.

Updated Date - 2021-07-26T06:59:28+05:30 IST