అమెరికాను కుదిపేస్తున్న కరోనా మహమ్మారి.. ఒకేరోజు 50 వేలకు పైగా కేసులు

ABN , First Publish Date - 2020-07-02T22:57:22+05:30 IST

అమెరికాను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. బుధవారం అమెరికా వ్యాప్తంగా 50

అమెరికాను కుదిపేస్తున్న కరోనా మహమ్మారి.. ఒకేరోజు 50 వేలకు పైగా కేసులు

వాషింగ్టన్: అమెరికాను కరోనా మహమ్మారి కుదిపేస్తోంది. బుధవారం అమెరికా వ్యాప్తంగా 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. అమెరికాలో ముఖ్యంగా కాలిఫోర్నియా, టెక్సాస్, అరిజోనా, ఫ్లోరిడా రాష్ట్రాలు కరోనాకు కేంద్రాలుగా మారాయి. కాలిఫోర్నియాలో బుధవారం ఒక్కరోజే 9,740 కేసులు నమోదవడంతో.. ఈ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 52,788కి చేరింది. గతంలో అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం కరోనాకు కేంద్రంగా ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి మామూలు స్థితికి చేరుకోగా.. మిగతా రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేయడం కారణంగానే కేసులు ఈ స్థాయిలో కేసులు వస్తున్నట్టు తెలుస్తోంది. మంగళవారం అమెరికా వ్యాప్తంగా దాదాపు 50 వేల కేసులు నమోదైతే.. బుధవారం ఏకంగా కేసుల సంఖ్య 50 వేలు దాటేసింది. అమెరికాలో నిత్యం లక్ష కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా.. అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 27,80,152 కరోనా కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి మొత్తంగా 1,30,798 మంది మృత్యువాతపడ్డారు.

Updated Date - 2020-07-02T22:57:22+05:30 IST