అమెరికాలో కరోనా కల్లోలం.. ఒక్క రోజే దాదాపు 2వేల మంది మృతి!

ABN , First Publish Date - 2020-08-07T21:22:01+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. కరోనా బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అగ్రరాజ్యం అమెరికాలోనూ

అమెరికాలో కరోనా కల్లోలం.. ఒక్క రోజే దాదాపు 2వేల మంది మృతి!

వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. కరోనా బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అగ్రరాజ్యం అమెరికాలోనూ ఈ మహమ్మారి విజృంభిస్తోంది. జాన్స్ హాప్కిన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న ఒక్కరోజే అమెరికాలో కరోనా కారణంగా సుమారు 2వేల మందిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మూడు నెలల తర్వాత.. అమెరికాలో ఒకే రోజు 2వేలకుపైగా కరోనా మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. కాగా.. రాబోయే రోజుల్లో అమెరికాలో మహమ్మారి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమెరికాలో గత కొద్ది రోజులుగా ప్రతి రోజు 50వేలపైగా కరోనా కేసులు నమోదవుతుండగా.. వెయ్యికిపైగా కొవిడ్ మరణాలు సంభవిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. న్యూయార్క్‌లో ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 32వేలు దాటింది. న్యూజెర్సీలో ఈ మహమ్మారి దాదాపు 16వేల మందిని పొట్టనబెట్టుకుంది. కాలిఫోర్నియాలో 10వేల మందికిపైగా కరోనా కాటుకు బలయ్యారు. కాగా.. అమెరికాలో ఇప్పటి వరకు మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 1.62లక్షలు దాటింది. 


Updated Date - 2020-08-07T21:22:01+05:30 IST