అమెరికాలో కరోనా విలయం.. 24 గంటల్లో 2.10 లక్షల కేసులు!

ABN , First Publish Date - 2020-12-04T19:07:08+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ విలయం సృష్టిస్తోంది.

అమెరికాలో కరోనా విలయం.. 24 గంటల్లో 2.10 లక్షల కేసులు!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ విలయం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో 2.10 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదైనట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది. దేశంలో కొవిడ్ ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇదే అత్యధికం అని పేర్కొంది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 1.41 కోట్లు దాటింది. అలాగే గురువారం ఒకేరోజు 2,907 మంది వైరస్‌కు బలైనట్టు తెలిపింది. దీంతో మొత్తం మరణాలు 2.75 లక్షలు దాటాయి. బుధవారం ఒక్కరోజే ఏకంగా లక్షకు పైగా బాధితులు ఆస్పత్రిలో చేరినట్టు జాన్స్ హాప్కిన్స్ వెల్లడించింది. 


దేశవ్యాప్తంగా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేచ్చేందుకు అగ్రరాజ్యం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఫైజర్, మోడెర్నా టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. దీంతో యూఎస్ ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన వెంటనే వీటిని ప్రజలకు అందించేందుకు యూఎస్ ఏర్పాట్లు చేస్తోంది. కాగా, డిసెంబర్ రెండో వారం నాటికి అమెరికన్లకు కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తాజాగా వెల్లడించారు.       




Updated Date - 2020-12-04T19:07:08+05:30 IST