అమెరికాలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. !

ABN , First Publish Date - 2020-06-04T04:40:31+05:30 IST

అమెరికాలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఒక్కరోజే అమెరికాలో 15,846 క

అమెరికాలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. !

వాషింగ్టన్: అమెరికాలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. జాన్స్  హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఒక్కరోజే అమెరికాలో 15,846 కరోనా కేసులు నమోదవ్వగా.. దాదాపు 863 మంది మరణించారు. కాగా.. నిరసనల కారణంగానే అమెరికాలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్లితే.. జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతి యువకుడిని శ్వేతజాతి పోలీసు అధికారి కాలితో తొక్కి అతికిరాతకంగా చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అగ్రరాజ్యం వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో లాస్‌ఏంజిల్స్, సాన్‌ఫ్రాన్సిస్కో, ఓక్‌లాండ్, న్యూయార్క్ తదితర ప్రాంతాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు. అమెరికా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నేషనల్ గార్డ్స్ కూడా రంగంలోకి దిగాయి. అయితే వేటినీ లెక్కచేయని నిరసనకారులు.. వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ‘జార్జి ఫ్లాయిడ్‌ను చంపిన పోలీసు అధికారులను కఠినంగా శిక్షించాలి’ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అగ్రరాజ్యంలో కరోనా కేసులు భారిగా పెరిగాయి. ఇదిలా ఉంటే.. అమెరికాల ఇప్పటి వరకు దాదాపు 19 లక్షల మంది కరోనా వైరస్ బారిన పడగా... మహమ్మారి బలైన వారి సంఖ్య ఇప్పటికే లక్షదాటింది. 


Updated Date - 2020-06-04T04:40:31+05:30 IST