Advertisement
Advertisement
Abn logo
Advertisement

న్యూయార్క్ గవర్నర్‌ విషయంలో బైడెన్ సంచలన నిర్ణయం!

వాషింగ్టన్: న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆండ్రూ విషయంలో అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బైడెన్ ఇతర చట్టసభ సభ్యులతో కలిసి న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో రాజీనామా చేయాలని కోరారు. రాష్ట్ర అటార్నీ జనరల్ నివేదిక ప్రకారం అతను 11 మంది మహిళలను లైంగికంగా వేధించినట్లు తేలింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ రాజీనామా చేయాల్సిందిగా బైడెన్ పిలుపునిచ్చారు. అటు తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను మొదటి నుంచి తీవ్రంగా ఖండిస్తూ వచ్చిన ఆండ్రూ క్యూమో తన పదవికి రాజీనామా చేసేందుకు కూడా అంగీకరించని విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర అటార్నీ జనరల్ రిపోర్టులో అతనిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడం, అధ్యక్షుడు రాజీనామా చేయాలని కోరడంతో ఆండ్రూ గవర్నర్ పదవి నుంచి దిగిపోక తప్పనిపరిస్థితి ఏర్పడింది.     


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement