తుపాకుల సంస్కృతికి కళ్లెం వేసే దిశగా బైడెన్ కీలక నిర్ణయం!
ABN , First Publish Date - 2021-04-09T13:06:51+05:30 IST
తుపాకుల సంస్కృతికి కళ్లెం వేసే దిశగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ చర్యలు చేపట్టారు. మద్యం, పొగాకు, ఆయుధాలు, పేలుడు పదార్థాల నిరోధక సంస్థ(ఏటీఎఫ్) డైరెక్టర్‌గా డేవిడ్ చిప్‌మాన్‌ను నియమించారు.
వాషింగ్టన్, ఏప్రిల్ 8: తుపాకుల సంస్కృతికి కళ్లెం వేసే దిశగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ చర్యలు చేపట్టారు. మద్యం, పొగాకు, ఆయుధాలు, పేలుడు పదార్థాల నిరోధక సంస్థ(ఏటీఎఫ్) డైరెక్టర్‌గా డేవిడ్ చిప్‌మాన్‌ను నియమించారు. మాజీ ఫెడరల్ ఏజెంట్ అయిన డేవిడ్ ప్రస్తుతం తుపాకుల నియంత్రణ సంస్థ గిఫార్డ్స్ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఏటీఎఫ్ ఏజెంట్‌గా ఆయన 25 ఏళ్లు పనిచేశారు.