గాల్లో ఉండగానే ఆగిపోయిన విమానం ఇంజన్..! హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..!

ABN , First Publish Date - 2022-07-11T03:12:21+05:30 IST

మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి యంత్రాలు పని చేయవు. అమెరికాకు చెందిన ఓ పైలట్ ఒకరు అచ్చంగా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు.

గాల్లో ఉండగానే ఆగిపోయిన విమానం ఇంజన్..! హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..!

ఎన్నారై డెస్క్: మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి యంత్రాలు పని చేయవు. అమెరికాకు చెందిన పైలట్(Pilot) ఒకరు ఇటీవల అచ్చంగా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. గాల్లో ఉండగా విమానం ఇంజిన్ ఆగిపోవడంతో(Engine failure) అతడు గాబరా పడిపోయాడు. ఆ తరువాత.. ప్రాప్తకాలజ్ఞతతో ఓ హైవేపై(Highway) విమానాన్ని అత్యవసరంగా దించేశాడు. చాలా చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్ చేస్తూ ప్రమాదం నుంచి బయటపడ్డాడు.  నార్త్‌కెరోలినాలోని(North Carolina) స్వెయిన్ కౌంటీలో(Swain county) ఈ ఘటన జరిగింది. విమానానికి అమర్చిన కెమెరాలో ఇదంతా రికార్డ్ అవడంతో ఆయన ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.  ఇది ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. 


విన్సెంట్ ఫ్రేజర్ అనే పైలట్ తన మామగారితో విమానంలో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా ఇంజన్ ఆగిపోవడంతో విన్సెంట్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. మళ్లీ ఇంజన్‌ను స్టార్ట్ చేసినా.. రెండు సెకన్ల తరువాత ఆగిపోయింది. విమానాన్ని అత్యవసరంగా దించేయడం మినహా మరో మార్గం లేకపోయింది. దీంతో.. విన్సెంట్ కిందకు చూడగా ఓ హైవే కనిపించడంతో అక్కడ విమానాన్ని దించేందుకు నిర్ణయించాడు. రహదారిపై వాహనాలను ఢీకొట్టకుండా, ఎవరికీ ఏ అపాయం కలగకుండా ల్యాండ్ చేయాలనుకున్న అతడు..అత్యంత నేర్పుగా విమానాన్ని దించాడు. అంతా అనుకున్నట్టు జరగడంతో ఊపిరి పీల్చుకున్నాడు. అయితే.. ల్యాండింగ్ సమయంలో మధ్యలో అడ్డొచ్చిన కరెంటు వైర్లను విన్సెంట్ చాకచక్యంగా తప్పిస్తూ విమానాన్ని ఎలా దించాడనేది వీడియోలో రికార్డైంది. ‘‘అదృష్టం బాగుండబట్టి సరిపోయింది గానీ.. లేకపోతే పెను ప్రమాదమే జరిగి ఉండేది’’ అని స్థానిక పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.  





Updated Date - 2022-07-11T03:12:21+05:30 IST