ఇతరుల బంతులు తాకొదన్న మహిళా అధికారి! కడుపుబ్బా నవుతున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2020-05-20T03:40:15+05:30 IST

ఇతరులు బంతులను తాకొద్దు.. ఇందులో రెండు అర్థాలు ధ్వనిస్తున్నాయా.. సారీ.. అయితే మేమంటున్నది కాదు.. సాక్షాత్తూ న్యూయార్క్‌ రాష్ట్రంలోని ఓ కౌంటీలోని మహిళా అధికారి అన్న మాటలు.

ఇతరుల బంతులు తాకొదన్న మహిళా అధికారి! కడుపుబ్బా నవుతున్న నెటిజన్లు!

న్యూయార్క్: ఇతరులు బంతులను తాకొద్దు.. ఇందులో రెండు అర్థాలు ధ్వనిస్తున్నాయా.. అయితే సారీ! కానీ ఇవి సాక్షాత్తూ న్యూయార్క్‌ రాష్ట్రంలోగల ఓ కౌంటీలోని మహిళా అధికారి అన్న మాటలు. టెన్నిస్ బాల్స్‌కు సంబంధించిన ఆ అధికారి చేసిన సూచనలు ప్రస్తుతం నెటిజన్లతో పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తున్నాయి. ‘కావాలంటే వాళ్ల బంతుల్ని తన్నండి. చేతితో మాత్రం అస్సలు తాకొద్దు’ అని సదరు అధికారి చెబుతూ పోయారు. టెన్నిస్ బాల్స్ అన్న పదాన్ని మాత్రం ఆమె చివర్లో పలికారు. తమ బంతులని, ఇతరుల బంతులనీ వేరు వేరుగా గుర్తించేందుకు వాటిపై స్కెచ్ పెన్నులతో పేర్లు రాసుకోవాలని కూడా చెప్పుకొచ్చారు. విషయాన్ని విపులంగా చెప్పాలనుకున్న ఆమె..తన వాక్యాల్లో ద్వంద్వార్థం ధ్వనిస్తోందన్న విషయాన్ని ప్రేక్షకుల నవ్వుల్ని బట్టి గానీ అర్థం చేసుకోలేకపోయారు. అప్పటికే అక్కడున్న వారు ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది.

Updated Date - 2020-05-20T03:40:15+05:30 IST