వామ్మో.. ఇలాంటి తల్లి కూడా ఉంటుందా..! కుమారుడికి కరోనా సోకిందని తెలిసి..

ABN , First Publish Date - 2022-01-09T00:05:00+05:30 IST

కుమారుడికి కరోనా వచ్చిందని తెలుసుకున్న ఓ మహిళ ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది.

వామ్మో.. ఇలాంటి తల్లి కూడా ఉంటుందా..!  కుమారుడికి కరోనా సోకిందని తెలిసి..

ఇంటర్నెట్ డెస్క్: కుమారుడికి కరోనా సోకిందని తెలుసుకున్న ఓ మహిళ ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది. తాను కూడా కరోనా బారిన పడతానేమోనని భయపడిపోయి అతడిని(13)  కారు డిక్కీలో నిర్బంధించింది. అదృష్టవశాత్తూ ఆ చిన్నారికి ఎటువంటి అపాయం కలగలేదు.  అయితే.. మరోసారి అతడికి కరోనా టెస్టు చేయించాలని ప్రయత్నిస్తుండగా ఈ దారుణం బయటపడింది. అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. జనవరి 3న శారా బీమ్ అనే మహిళ స్థానిక కరోనా టెస్టింగ్ కేంద్రానికి వెళ్లింది. 


అయితే..అక్కడున్న సిబ్బంది ఆమె కారులోంచి ఏవో శబ్దాలు రావడం గుర్తించారు. అసలు ఏం జరుగుతోందని ఆమెను ప్రశ్నించారు. శారా తొలుత వారిని మభ్య పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ.. సిబ్బంది గద్దించి అడగటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు చెప్పారు. దీంతో..పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. కుమారుడికి ప్రాణాపాయం కలిగించినందుకు శారాపై కేసు నమోదు చేశారు. 

Updated Date - 2022-01-09T00:05:00+05:30 IST