Norwayలో కుప్పకూలిన యూఎస్ సైనిక విమానం...నలుగురి గల్లంతు

ABN , First Publish Date - 2022-03-19T13:16:14+05:30 IST

ఉత్తర నార్వేలో అమెరికా సైనిక విమానం ప్రమాదవశాత్తూ కుప్పకూలిపోయింది...

Norwayలో కుప్పకూలిన యూఎస్ సైనిక విమానం...నలుగురి గల్లంతు

ఓస్లో: ఉత్తర నార్వేలో అమెరికా సైనిక విమానం ప్రమాదవశాత్తూ కుప్పకూలిపోయింది. నలుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న యూఎస్ సైనిక విమానం కూలిపోయిందని ఆ దేశ జాయింట్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్స్ తెలిపింది.వి-22 ఓస్ప్రే విమానం ప్రతికూల వాతావరణం వల్ల కుప్పకూలిపోయింది. సైనిక విమానం కోల్డ్ రెస్పాన్స్ అనే నాటో సైనిక వ్యాయామంలో పాల్గొంటుండగా తప్పిపోయింది.అత్యవసర సిగ్నల్ అందిన తర్వాత విమానం కూలిపోయిందని వెల్లడైంది. విమానంలో ఉన్న నలుగురి పరిస్థితి మాత్రం తెలియలేదు. వారు గల్లంతు అయ్యారని భావిస్తున్నారు. 


Updated Date - 2022-03-19T13:16:14+05:30 IST