Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

Jackpot: లక్కీ ఫెలో.. కలను ఫాలో అయ్యాడు.. కోట్లు గెలచుకున్నాడు!

twitter-iconwatsapp-iconfb-icon
Jackpot: లక్కీ ఫెలో.. కలను ఫాలో అయ్యాడు.. కోట్లు గెలచుకున్నాడు!

ఇంటర్నెట్ డెస్క్: మనకు వచ్చే కలలు నిజం అవుతాయా? అంటే.. చెప్పడం కష్టం. ఎందుకంటే అవి జరిగినట్లు ఎవరూ చెప్పలేదు. ఇక ఇష్టమైన కలలు వచ్చినప్పుడు అవి నిజమవ్వాలని కోరుకోనివారు ఉండరు. అయితే, అమెరికాలో ఓ వ్యక్తికి వచ్చిన కల నిజంగానే నిజమైంది. తనకు వచ్చిన కలను కలే కదా అని అతడు కొట్టిపారేయలేదు. దాన్ని ఫాలో అయిపోయాడంతే. అదే అతనికి కోట్లు తెచ్చిపెట్టింది. అదెలాగో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. వర్జీనియాలోని హెన్రికో కౌంటీకి చెందిన అలోంజో కోల్‌మాన్‌నే అతడికి వచ్చిన కల ఇలా కోటీశ్వరుడిని చేసింది. అతడికి 13–14–15–16–17–18–19 నంబర్ల లాటరీ కొనుగోలు చేయడం, అదే నంబర్ తనను విజేతగా నిలబెట్టినట్టు కల వచ్చింది. దాంతో తనకు వచ్చిన ఆ కలను అలోంజో కలే కదా అని లైట్‌ తీసుకోలేదు.


కలలో వచ్చిన ఆ నంబర్లను అలాగే గుర్తు పెట్టుకున్నాడు. ఆ తర్వాత అదే నంబర్లతో(13–14–15–16–17–18) ఉన్న 'ప్లే యువర్ వే' అనే రాఫెల్ కంపెనీకి చెందిన లాటరీ టికెట్‌‌ను రెండు డాలర్లు పెట్టి కొనుగోలు చేశాడు. అప్పటినుంచి లాటరీ నిర్వాహకులు ప్రకటించిన డ్రా తేదీ జూన్‌ 11 కోసం ఎదురుచూస్తున్నాడు. చూస్తుండగానే ఆ తేదీ రానే వచ్చింది. అప్పటికీ అలోంజోకి ఒకపక్క అనుమానంగానే ఉంది. కల నిజం కావడం జరుగుతుందా? అని. ఏముంది ఒకసారి వెళ్లి చూస్తే సరి అనుకుని.. డ్రా తీసిన రోజు వెళ్లి చూశాడు. ఒక్కసారి తన కనులను తాను నమ్మలేకపోయాడు. ఎందుకంటే స్క్రీన్‌ మీద అతడు కొనుగోలు చేసిన లాటరీ నంబర్‌ 13–14–15–16–17–18 రెండున్నర లక్షల డాలర్లు(సుమారు రూ.1.9కోట్లు) గెలుపొందినట్టుగా ఉంది. అంతే.. ఎగిరి గంతేశాడు. ఈ సందర్భంగా అలోంజో మాట్లాడుతూ.. తన కలలో వచ్చిన నంబర్‌ సెట్స్‌తోనే లాటరీ టికెట్ కొనడం.. అదే లాటరీ టికెట్‌‌కు జాక్‌పాట్ తగలడం నిజంగా నమ్మలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు‌. మీరు కూడా మీ కలను నమ్మండి అంటూ తెలిపాడు.     

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.