విషం తీసుకున్న వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని.. అమెరికాలో..

ABN , First Publish Date - 2021-04-11T13:03:21+05:30 IST

అమెరికాలో ఎనిమిది మంది నిరాశ్రయులకు విషం పెట్టిన వ్యక్తికి కోర్టు శుక్రవారం నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది.

విషం తీసుకున్న వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని.. అమెరికాలో..

కాలిఫోర్నియా: అమెరికాలో ఎనిమిది మంది నిరాశ్రయులకు విషం పెట్టిన వ్యక్తికి కోర్టు శుక్రవారం నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. కాలిఫోర్నియాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విషం తీసుకున్న వారు ఏ విధంగా ప్రవర్తిస్తారో చూసి వారి రియాక్షన్‌ను రికార్డ్ చేయాలని విలియమ్ అనే వ్యక్తి అనుకున్నాడు. ఇందులో భాగంగా ఎనిమిది మంది నిరాశ్రయుల ఆహారంలో విలియమ్ విషం కలిపాడు. విషం కలిపిన విషయం తెలియకపోవడంతో నిరాశ్రయులు ఆహారాన్ని తీసుకున్నారు. ఈ ఆహారం తిన్న వెంటనే బాధితులకు వాంతులు అవడం, కడుపు నొప్పి రావడంతో వారిని ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. వారి ఆహారంలో విలియమ్ విషం కలిపినట్టు తెలియడంతో అధికారులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని ప్రాసెక్యూటర్లు తెలిపారు. నిరాశ్రయులకు విషం పెట్టిన కారణంగా కోర్టు విలియంకు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది.

Updated Date - 2021-04-11T13:03:21+05:30 IST