Abn logo
Apr 17 2021 @ 16:22PM

టెడ్డీబేర్ వేషధారణలో ఏకంగా 400కిలోమీటర్లు నడిచేశాడు!

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన ఫొటోలు  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. విషయంలోకి వెళితే.. అమెరికాకు చెందిన 33ఏళ్ల జెస్సీ లారీస్ వినూత్నంగా పాదయాత్ర చేశాడు. టెడ్డీబేర్ వేషధారణలో లాస్ ఏంజిల్స్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వరకు దాదాపు 400 కిలోమీటర్లు  నడిచాడు. ఈ క్రమంలో అతని పాదయాత్రకు సంబంధించిన ఫొటోలను కొందరు నెట్టింట పోస్ట్ చేయడంతో అవికాస్తా వైరల్‌గా మారాయి. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. ‘అతను ఈ వినూత్న పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జెస్సీ లారీస్ స్పందించారు. ఎటువంటి లక్ష్యం లేకుండానే ఈ పాదయాత్ర చేపట్టినట్టు వివరించాడు. ఇదిలా ఉంటే.. 2020లో ఇదే వేషధారణలో జెస్సీ లారీస్.. మారథాన్‌లో కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. 


Advertisement
Advertisement
Advertisement