ఆసియన్ స్పా కాల్పుల్లో నలుగురి హత్య.. అమెరికన్‌కు జీవితఖైదు

ABN , First Publish Date - 2021-07-28T08:01:13+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో కలకలం రేపిన ‘స్పా కిల్లింగ్స్’లో ఒక నిందితుడికి జీవితఖైదు విధించారు.

ఆసియన్ స్పా కాల్పుల్లో నలుగురి హత్య.. అమెరికన్‌కు జీవితఖైదు

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కలకలం రేపిన ‘స్పా కిల్లింగ్స్’లో ఒక నిందితుడికి జీవితఖైదు విధించారు. ఈ మేరకు కోర్టు తీర్పునిచ్చింది. అట్లాంటా ప్రాంతంలోని స్పాల్లో విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఈ ఘటనలో నలుగురు మహిళలను చంపినట్లు తేలడంతో ఒక అమెరికన్ యువకుడికి జీవితఖైదు విధించారు. అతను చంపిన వారిలో ఇద్దరు మహిళలు ఆసియా మూలాలున్న వారు. మార్చి నెలలో జరిగిన ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మృతిచెందారు. అట్లాంటాలోని రెండు ప్రాంతాల్లో ఈ కాల్పులు జరిగాయి. ఈ కేసులో నిందితుడిని త్వరలోనే అట్లాంటాకు తరలిస్తారు. అక్కడ అతనిపై మరో నాలుగు హత్యల కేసులో విచారణ జరుగుతుంది.

Updated Date - 2021-07-28T08:01:13+05:30 IST