కరోనాను జయించిన అమెరికన్.. అతడు చెప్పింది తెలిస్తే షాకవుతారు..!

ABN , First Publish Date - 2020-05-23T00:32:48+05:30 IST

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహమ్మారి బారినపడి.. దాని కోరల్లోంచి బయటపడిన వారు.. అది ఎంత ప్రమాదకారో ప్రజల

కరోనాను జయించిన అమెరికన్.. అతడు చెప్పింది తెలిస్తే షాకవుతారు..!

కాలిఫోర్నియా: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహమ్మారి బారినపడి.. దాని కోరల్లోంచి బయటపడిన వారు.. అది ఎంత ప్రమాదకారో ప్రజలకు వివరిస్తూన్నారు. తమ అనుభవాలను పంచుకుంటూ.. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ఓ వ్యక్తి.. తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడ్డాడు. దీంతో స్థానికంగా ఉన్న హాస్పటల్‌లో చేరాడు. ఆరువారాలపాటు చికిత్స తీసుకుని.. మహమ్మారిని జయించాడు. అయితే ఈ ఆరువారాల్లో తన శరీరంలో చోటుచేసుకున్న మార్పులను చూసుకుని.. అతను అవాక్కయ్యాడు. ఆరువారాల్లో ఏకంగా 23కిలోల బరువు తగ్గినట్లు తెలుసుకుని షాక్‌కు గురయ్యాడు. దీంతో కరోనా బారినపడక ముందు, మహమ్మారిని జయించిన తర్వాత తన శరీరంలో చోటుచేసుకున్న మార్పలు స్పష్టంగా నెటిజన్లకు తెలిసేలా ఓ ఫొటోను తన ఇన్‌స్ట్రాగ్రాంలో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా 86కేజీలు ఉన్న అతను కరోనా బారినపడి 23 కిలోలు తగ్గినట్లు పేర్కొన్నాడు. కొవిడ్-19 కోరల్లో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించాడు. 


Updated Date - 2020-05-23T00:32:48+05:30 IST