ఈయన లక్కీ పర్సన్ కాదు.. లక్‌కు కేరాఫ్ అడ్రస్!

ABN , First Publish Date - 2020-08-08T00:00:17+05:30 IST

సాధారణంగా ఎవరికైనా లాటరీ తగిలితే.. వారిని లక్కీ పర్సన్ అంటారు. కొనుగోలు చేసిన ప్రతి టికెట్‌కు లాటరీ తగిలితే.. వారిని లక్‌కు కేరాఫ్ అడ్రస్‌గా అభివ

ఈయన లక్కీ పర్సన్ కాదు.. లక్‌కు కేరాఫ్ అడ్రస్!

వాషింగ్టన్: సాధారణంగా ఎవరికైనా లాటరీ తగిలితే.. వారిని లక్కీ పర్సన్ అంటారు. కొనుగోలు చేసిన ప్రతి టికెట్‌కు లాటరీ తగిలితే.. వారిని లక్‌కు కేరాఫ్ అడ్రస్‌గా అభివర్ణిస్తారు. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కూడా ఈ కోవలోకే వస్తాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. వర్జీనియా రాష్ట్రానికి చెందిన రేమండ్ హారింగ్టన్ గత నెల 17న.. స్థానికంగా ఉన్న బీచ్‌కు వెళ్లాడు. అంతేకాకుండా బీచ్ వద్ద ఉన్న ఓ దుకాణంలో 1 డాలర్‌కు ఒకటి చొప్పున.. 25 డాలర్ల వెచ్చించి, 25 లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో లక్కీ డ్రాలో.. నమ్మశక్యం కాని విధంగా.. రేమండ్ హారింగ్టన్ కొనుగోలు చేసిన ప్రతి టికెట్టు.. అతనికి డబ్బులను తెచ్చిపెట్టింది. లక్కీ డ్రాలో రేమండ్ హారింగ్టన్.. ప్రతి టికెట్‌కు 5వేల డాలర్ల చొప్పున.. 25 టికెట్లకు మొత్తం 1,25,000డాలర్ల (దాదాపు రూ. 94లక్షల)ను గెలుచుకున్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే మొదటగా షాక్‌కు గురైన రేమండ్ హారింగ్టన్.. అనంతరం సంతోషం వ్యక్తం చేశాడు. కాగా.. ఈ డబ్బును తన ఇద్దరు కొడుకుల చదువు కోసం ఖర్చు చేయనున్నట్లు రేమండ్ హారింగ్టన్ వెల్లడించాడు. 


Updated Date - 2020-08-08T00:00:17+05:30 IST