మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లోకి చొరబడి.. అమెరికన్ చేసిన నిర్వాకమిదీ!

ABN , First Publish Date - 2021-03-11T17:04:03+05:30 IST

మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లోకి చొరబడి ఆమెతో పాటు ఇద్దరు కుటుంబ సభ్యులను 17 గంటల పాటు బందీలుగా చేసుకుని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని యూఎస్ రక్షణ దళాలు మట్టుపెట్టాయి.

మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లోకి చొరబడి.. అమెరికన్ చేసిన నిర్వాకమిదీ!

లివర్‌మోర్ ఫాల్స్, మైనే: మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లోకి చొరబడి ఆమెతో పాటు ఇద్దరు కుటుంబ సభ్యులను 17 గంటల పాటు బందీలుగా చేసుకుని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని యూఎస్ రక్షణ దళాలు మట్టుపెట్టాయి. ఈ ఘటన అమెరికాలోని మైనేలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మైనేలోని జేకు చెందిన డొనాల్డ్ వైట్ అనే వ్యక్తి ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. లివర్‌మోర్ ఫాల్స్‌లో ఉండే తన మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లోకి డొనాల్డ్ మంగళవారం బలవంతంగా చోరబడ్డాడు. అనంతరం ఆ ఇంట్లో ఉన్న ముగ్గురిని బందీలుగా చేసుకున్నాడు. తన వద్ద భారీ పేలుడు పదార్థాలు ఉన్నాయని, ఎవరైనా లోపలికి వస్తే పేల్చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. 


ఇలా 17 గంటల పాటు ఇంట్లోని ముగ్గురిని బందీలుగా చేసుకుని నరకం చూపించాడు. దీంతో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. డొనాల్డ్‌ను లొంగిపోవాలని కోరగా.. అతను ప్రతిఘటించాడు. దాంతో తప్పని పరిస్థితులు కాల్పులు జరిపాయి. అయితే, డొనాల్డ్ మాత్రం తనను తాను కాల్చుకుని చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం బాంబ్ స్క్వాడ్ సహాయంతో ఇంటిని సోదా చేశాయి. ఆయన ఇంట్లో పాతిపెట్టిన పేలు పదార్థాలను గుర్తించి నిర్వీర్యం చేశాయి. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.  

   

Updated Date - 2021-03-11T17:04:03+05:30 IST