Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాముల భయంతో అతడు చేసిన పనికి రూ.7.5 కోట్ల నష్టం.. America లో హాట్ టాపిక్..!

ఎన్నారై డెస్క్: ఇంటి చుట్టుపక్కల అడవి ఉంటే.. ఆ ఇంట్లో ఉండే వారికి పాముల బెడద ఎక్కువ ఉంటుంది. ఇంట్లోకి తరచూ పాములు వస్తూ.. ఇంట్లో ఉన్నవారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అటువంటి సమయంలో పాములు పట్టుకునే వాళ్లను పిలిపించి.. ఇంట్లోకి వచ్చిన పాములను దూరంగా పడేయమని చెబుతారు. లేకపోతే.. వాళ్లే ధైర్యం చేసి.. పాములను పట్టుకుని దూరంగా వదిలేస్తారు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం తన ఇంట్లో దూరిన పామును పట్టుకోబోయి.. భారీ నష్టాన్ని మూటకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ అంశం అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకూ ఏం జరిగిందంటే..


అమెరికాలోని మేరీలాండ్‌లో ఓ వ్యక్తికి సుమారు 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు ఉంది. అయితే  చుట్టుపక్కల అడవి ఉందో లేక మరేదైనా కారణమో కానీ.. ఆ ఇంట్లోకి తరచూ పాములు వస్తూ ఉండేవి. ఈ క్రమంలోనే  తాజాగా అతడి ఇంట్లో పాము దూరింది. అది గమనించిన ఇంటి యజమాని.. బొగ్గులను మండించి పొగ పెట్టడం ద్వారా పామును బయటికి రప్పించొచ్చని భావించాడు. ఇందులో భాగంగానే ఇంట్లో అక్కడక్కడా భారీగా బొగ్గును పేర్చి, నిప్పు పెట్టాడు. దీంతో ప్రమాదవశాత్తు నిప్పు.. ఇంట్లోని కర్టెన్లకు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బందికి సమాచారం అంది.. అక్కడకు చేరి మంటలను ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఇల్లు పూర్తిగా తగలబడిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగనప్పటికీ.. సదరు ఇంటి యజమాని భారీ నష్టాన్ని మూటకట్టుకున్నాడు. ఈ ప్రమాదంలో సుమారు రూ.7.5కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది అభిప్రాయపడ్డారు. Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement