తాను స్పీకర్ అయితే.. పెలోసీని గావెల్‌తో కొడతానన్న అమెరికా నేత

ABN , First Publish Date - 2021-08-03T07:01:02+05:30 IST

ప్రస్తుత అమెరికా పార్లమెంటు స్పీకర్ నాన్సీ పెలోసిని గావెల్ (స్పీకర్ చేతి వద్ద ఉండే చెక్క సుత్తి)తో కొడతానని అమెరికా నేత, రిపబ్లికన్ పార్టీ సభ్యుడు కెవిన్ మెక్‌కార్తీ అన్నారు.

తాను స్పీకర్ అయితే.. పెలోసీని గావెల్‌తో కొడతానన్న అమెరికా నేత

వాషింగ్టన్: ప్రస్తుత అమెరికా పార్లమెంటు స్పీకర్ నాన్సీ పెలోసిని గావెల్ (స్పీకర్ చేతి వద్ద ఉండే చెక్క సుత్తి)తో కొడతానని అమెరికా నేత, రిపబ్లికన్ పార్టీ సభ్యుడు కెవిన్ మెక్‌కార్తీ అన్నారు. ఆయన ఇలా మాట్లాడటం ప్రస్తుతం వివాదాస్పదం అవుతోంది. అయితే కెవిన్ మాత్రం ఈ మాటలు జోక్‌గానే అన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అమెరికాలో మరోసారి మాస్కు తప్పనిసరి నిబంధన తీసుకురావాలనే వాదన వచ్చింది. ఈ నిబంధనను యూఎస్ పార్లమెంటులో కూడా అమలు చేయాలని నాన్సీ.. సభ్యులకు చెప్పారు. అయితే ఈ నిబంధనను తప్పుబట్టిన కెవిన్.. ఈ విషయంలో పార్లమెంటులో పోరాడతామని అన్నారు. ఆయన మాటలపై స్పందించిన నాన్సీ ఆయన్ను ‘మోరాన్’ (వెర్రివాడు) అంటూ తిట్టారు. ఈ నేపథ్యంలోనే కెవిన్ తాజాగా మాట్లాడుతూ.. ‘‘తన చేతిలోని గావెల్‌ను నాన్సీ నాకు ఇచ్చినప్పుడు చూడండి. తనను కొట్టకుండా ఉండటం చాలా కష్టం’’ అంటూ జోక్ చేశారు. ఆయన ఇది సరదాగానే అన్నా ప్రస్తుతం కెవిన్ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.

Updated Date - 2021-08-03T07:01:02+05:30 IST