అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగుల సంఖ్య..!

ABN , First Publish Date - 2020-05-29T21:26:09+05:30 IST

కరోనా వైరస్ కారణంగా అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గత వారం మరో 2.1 మిలియన్ల మంది నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చే

అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగుల సంఖ్య..!

వాషింగ్టన్: కరోనా వైరస్ కారణంగా అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గత వారం మరో 2.1 మిలియన్ల మంది నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు నిరుద్యోగ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య నాలుగు కోట్లకు చేరిందని అధికారులు పేర్కొన్నారు. కాగా.. ఏప్రిల్‌లో 14.7 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు.. మేలో 20 శాతానికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో వ్యాపార సముదాయాలు క్రమంగా తెరుచుకుంటున్నప్పటికీ.. నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. కరోనా కారణంగా అమెరికా వ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించడంతో.. వ్యాపార సముదాయాలు, రెస్టారెంట్‌లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. దీంతో అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య గణణీయంగా పెరిగింది. ఇదిలా ఉంటే.. అమెరికాలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటి అమెరికాలో మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య లక్ష దాటింది. ఇది 9/11 దాడుల్లో సంభవించిన మరణాల సంఖ్య కంటే 33 రెట్లు అధికం. 


Updated Date - 2020-05-29T21:26:09+05:30 IST